Read more!

English | Telugu

'ప్రతినిధి 2' కొత్త విడుదల తేదీ.. రాజకీయ ప్రకంపనలేనా!

నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). ఈ పొలిటికల్ ఫిల్మ్ ని వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

'ప్రతినిధి 2' చిత్రాన్ని మే 10న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత నారా రోహిత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికితోడు ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలో పొలిటికల్ ఫిల్మ్ గా వస్తున్న 'ప్రతినిధి 2' ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి.