Read more!

English | Telugu

'పోకిరి' స్పెషల్ షోల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవుతారు!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'పోకిరి' మూవీ 2006 లో విడుదలై సౌత్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా వచ్చి 16 ఏళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని తాజాగా రుజువైంది.

నిన్న(ఆగస్టు 9) మహేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 375 కి పైగా స్క్రీన్స్ లో పోకిరి షోలు వేశారు. దాదాపు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యి, రిలీజ్ డే నాటి సందడి థియేటర్స్ దగ్గర కనిపించింది. పోకిరి స్పెషల్ షోల కలెక్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్రలో రూ.24,89,638 గ్రాస్(24 లక్షల 89 వేల 638 రూపాయాల గ్రాస్ ), గుంటూరులో రూ.13,02,265 గ్రాస్, కృష్ణాలో 10,25,251 గ్రాస్, ఈస్ట్ గోదావరిలో రూ.11,78,820 గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లోనూ అదే జోరు చూపించింది. యూఎస్ఏలో 15,598 డాలర్లు, ఆస్ట్రేలియాలో 3,733 డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా స్పెషల్ షోలతో కోటికి పైగా గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.