English | Telugu
పెద్ది ఐటెం సాంగ్ లో స్టార్ హీరోయిన్!
Updated : May 3, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi). చరణ్ కి రంగస్థలం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మైత్రి మూవీస్(Mythri Movie Makers)ఈ మూవీని నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు. కొన్నిరోజులుగా చిత్రీకరణ దశలో ఉన్న పెద్ది రీసెంట్ గా షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 న చరణ్ 'లండన్ టూస్సాడ్స్' లో జరిగే తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోను, 11 న లండన్ లోనే ఆర్ఆర్ఆర్ కి సంబంధించి జరిగే ఒక ఈవెంట్ లో మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో కలిసి పాల్గొంటున్నాడు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తవ్వగానే పెద్ది షూటింగ్ యధావిధిగా జరగనుంది.
'పెద్ది'లో స్టార్ హీరోయిన్ 'శ్రీలీల'(Sreeleela)ప్రత్యేక గీతంలో చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. శ్రీలీల ఇప్పటికే మైత్రి బ్యానర్ లోనే వచ్చిన 'పుష్ప 2(Pushpa 2)'లో 'కిస్సిక్' సాంగ్ చేసి, పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించింది. మైత్రి బ్యానర్ లోనే రీసెంట్ గా నితిన్(Nithiin)తో కలిసి 'రాబిన్ హుడ్ చేసింది. మైత్రినే తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోను పవన్(Pawan Kalyan)తో జోడి కడుతుంది. దీంతో మైత్రి మేకర్స్ శ్రీలీలని 'పెద్ది'లో ప్రత్యేక గీతంలో చేయమని అడగటం, పైగా రామ్ చరణ్ లాంటి బడా స్టార్ కావడంతో శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. శ్రీలీల ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)తో కలిసి 'ఆషీకీ 3 'ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవుతుంది. రవితేజ(Ravi Teja)తో 'మాస్ జాతర' లో కూడా జత కడుతుంది.
ఇక 'గేమ్ చేంజర్' పరాజయంతో మెగా అభిమానుల ఆశలన్నీ'పెద్ది' పైనే ఉన్నాయి. ఇప్పటికే 'పెద్ది' నుంచి రిలీజైన చరణ్ లుక్, టీజర్ ఒక రేంజ్ లో ఉన్నాయి. చరణ్ సరసన జాన్వీ కపూర్(Janvi Kapoor)జత కడుతుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు(Jagapathibabu)కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎ ఆర్ రెహమాన్(Ar Rehman)సంగీతాన్ని అందిస్తుండగా చరణ్ బర్త్ డే సందర్భంగా 2026 మార్చి 27 న పెద్ది వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
