English | Telugu
బాలకృష్ణ, అజిత్ కి పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారో చెప్పిన పవన్ కళ్యాణ్
Updated : Apr 28, 2025
వివిధ రంగాల్లో సుదీర్ఘ కాలంగా సేవలందించే ప్రముఖులకి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అందించే మూడో అతి పెద్ద ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్(Padmabhushan). ఈ పురస్కారాన్ని కళారంగంలో ఎప్పట్నుంచో సేవలందిస్తుందుకు గాను ప్రముఖ హీరోలు నందమూరి బాలకృష్ణ,(Balakrishna)అజిత్(Ajith KUmar)నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో రాష్ట్రపతి(Rashtrapati)చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సోషల్ మీడియా(Social Media)వేదికగా ట్వీట్ చేస్తు హిందూపురం శాసన సభ్యులు, హీరో బాలకృష్ణ గారు పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కళాసేవతో పాటు ప్రజా సేవలోను ఆయన మరిన్ని మైలు రాళ్లు అందుకోవాలని కోరుకుంటున్నాను.
అజిత్ కుటుంబ, ప్రేమకధా చిత్రాలతో మెప్పిస్తునే మరో పక్క వైవిధ్యమైన చిత్రాలు చేస్తు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు.స్టైల్ పరంగా తనకంటూ ఒక ముద్ర వేసుకొని రేసర్ గాను రాణిస్తున్నారు.ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేసాడు.
