Read more!

English | Telugu

ఎన్టీఆర్‌ కోసం హాలీవుడ్‌ నుంచి ఇండియాకు వస్తున్నాడు.. ఎందుకో తెలుసా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేస్తున్న ‘దేవర’ చిత్రంపైనే అందరి చూపూ ఉంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. కొంత ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్‌ వర్క్‌ దాదాపు పూర్తయినట్టే. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘వార్‌2’ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు ఎన్టీఆర్‌. 

2019లో వచ్చిన ‘వార్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్‌2’ రూపొందుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కబీర్‌ పాత్రలో మళ్ళీ హృతిక్‌ రోషన్‌ కనిపించబోతున్నాడు. అతన్ని ఢీ కొట్టే యోధుడిగా ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ టీమ్‌లో ఎన్టీఆర్‌ కూడా ఒక భాగం కావడంతో సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా ఇది. స్పిరో రజాటోస్‌కి ఇంటర్నేషనల్‌ లెవలనలో యాక్షన్‌ డైరెక్టర్‌గా చాలా మంచి పేరు ఉంది. ఎన్నో హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన స్పిరో గత ఏడాది వచ్చిన ‘జవాన్‌’ చిత్రంలోని ఫైట్స్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేశాడు. 

ఇప్పుడు ‘వార్‌2’ కోసం స్పెషల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేయబోతున్నాడు స్పిరో. ఈ సినిమాను భారీ తారాగణంతోపాటు హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రానికి భారీ విజయం చేకూరేలా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. ముంబై కలీనా విమానాశ్రయంలో దిగినపుడు  ఎన్టీఆర్‌ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయాయి. అలాగే సినిమాకి సంబంధించి హృతిక్‌ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. హృతిక్‌ రోషన్‌కి ఎంత ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే హృతిక్‌ మాత్రం ఎన్టీఆర్‌ రాక కోసం, అతనితో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్టు గతంలో కూడా పోస్టులు పెట్టాడు. 

జూలై నెలాఖరు వరకు ఎన్టీఆర్‌కి సంబంధించిన పోర్షన్‌ షూటింగ్‌ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ 60 రోజులు కేటాయిస్తున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ను నెలరోజులపాటు చిత్రీకరిస్తారట. మొత్తానికి ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఎంతో భారీగా ఉండబోతోందని ‘వార్‌ 2’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విశేషాలను చూస్తే అర్థమవుతుంది. మరి నార్త్‌ ఇండియన్‌ ప్రేక్షకుల్ని తారక్‌ ఎంత థ్రిల్‌ చేస్తాడో, అక్కడ ఎలాంటి ఇమేజ్‌ తెచ్చుకుంటాడో చూడాలి.