Read more!

English | Telugu

ప్రేమ లేదు తొక్క లేదు..పెళ్లి మాత్రం అందుకే..బాహుబలి ముద్దుగుమ్మ వ్యాఖ్య

 

బాహుబలి లోని మనోహరి సాంగ్ ప్రత్యేకత అందరకి తెలిసిందే. ప్రభాస్ తో కలిసి కొంత మంది ముద్దుగుమ్మలు డాన్స్ చేస్తారు. ఆ ముద్దుగుమ్మల్లో ఒకరు నోరా ఫతేహి. ఎన్టీఆర్ టెంపర్ , రవితేజ కిక్ 2 లోను  ఐటెం సాంగ్స్ చేసి మంచి గుర్తింపుని పొందింది. ఆమె తాజాగా బాలీవుడ్ లో జరిగే పెళ్లిళ్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి టోటల్ ఇండియన్ చిత్ర పరిశ్రమనే షేక్ చేస్తున్నాయి. 

నోరా తాజాగా ఒక  ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు  కొంతమంది హిందీ తారలు బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ లో తమ పరిచయాలను పెంచుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అసలు ఆ జంటల మధ్య ప్రేమే ఉండదు. కేవలం  ఒకరి ద్వారా మరొకరు సినిమాల్లో  అవకాశాలు దక్కిచుకోవడానికే పెళ్లి తంతు. కొంతమంది అయితే వార్తల్లో ఉండేందుకు కూడా పెళ్లి చేసుకుంటారు. డబ్బు కోసం కూడా  పెళ్లిళ్లు జరుగుతాయంటూ  కామెంట్స్ చేసింది. 
  
నోరా ఎవర్ని ఉద్దేశించి  ఈ కామెంట్స్‌ చేసిందనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తుంది. మరి ఆమె వ్యాఖ్యలపై  ఎవరైనా బాలీవుడ్ కపుల్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఎందుకంటే గత కొంత కాలం నుంచి  చాలా మంది బాలీవుడ్ తారలు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటు వస్తున్నారు. ఇక నోరా స్వస్థలం  కెనడా. అక్కడే పుట్టి పెరిగింది.  2014 లో వచ్చిన రోర్ తో బాలీవుడ్ లో  సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి దాకా సుమారు 15  చిత్రాల్లో మెరిసింది. కాకపోతే ఎక్కువ భాగం  ఐటెం సాంగ్స్ నే. కాకపోతే  వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కాలో మాత్రం ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రని పోషిస్తుంది.