English | Telugu
బన్నీ సినిమాలో విజయ్ ఫ్లాప్ హీరోయిన్లు!
Updated : Apr 29, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కేవలం అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. (AA22xA6)
బన్నీ-అట్లీ మూవీలో ముగ్గురు హీరోయిన్లు అంటూ ముందునుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హీరోయిన్లుగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొణె కన్ఫర్మ్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే జాన్వీ, మృణాల్ ఈ సినిమాలో భాగం కావడం నిజమే కానీ.. దీపిక మాత్రం నటించట్లేదని తెలుస్తోంది. ఇందులో నటించే మూడో హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే అని సమాచారం.
వరుస హిందీ సినిమాలతో అలరిస్తున్న అనన్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2022లో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్'లో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషమని చెప్పాలి.
మరో హీరోయిన్ మృణాల్ తెలుగులో 'సీతారామం', 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి సినిమాలు చేయగా.. అందులో విజయ్ తో యాక్ట్ చేసిన 'ఫ్యామిలీ స్టార్' నిరాశపరిచింది.
ఇక జాన్వీ విషయానికొస్తే, వరుసగా తెలుగు స్టార్స్ పక్కన సందడి చేస్తోంది. మొదట తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర'లో నటించింది. ప్రస్తుతం 'పెద్ది'లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు బన్నీ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
