Read more!

English | Telugu

విజయ్, మహేష్ బాబు, షారుక్, మమ్ముట్టి  ఒకే సినిమాలో.. జైలర్ దర్శకుడు వెల్లడి   

ఇప్పుడు ఇండియన్ సినీ ప్రేమికులు ఒక న్యూస్ నిజమవ్వాలని  కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు తమ ఇష్ట దైవాలని కూడా ప్రార్థిస్తున్నారు. అంత  గొప్ప వార్త ఏంటి అని అనుకుంటున్నారా! చెప్తే మీరు కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. నమ్మడంలేదా..అయితే రెడీ అవ్వండి 


ఇళయ దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, షారుక్ ఖాన్, మమ్ముట్టి.. ఈ నలుగురు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. మూవీ లవర్స్ కి అంత కంటే పెద్ద పండగ ఉండదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్  దాన్ని నిజం చేస్తానంటున్నాడు. ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం   ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తో బిజీగా ఉన్నాడు. అది ఆయనకి 68 వ చిత్రం. పొలిటికల్ పార్టీ పెట్టిన నేపథ్యంలో 69 వ సినిమా చేసి సినిమాలకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. 69 వ మూవీకి నెల్సన్ దర్శకుడుగా ట్రై చేస్తున్నాడు.దీంతో తనకి అవకాశం వస్తే విజయ్ మూవీ కోసం  తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ని ,బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ ని, మళయాళం నుంచి మమ్ముట్టిలని తీసుకొస్తానని చెప్తున్నాడు. అంటే ఆ నలుగురి కాంబోలో సినిమా తీస్తానని చెప్తున్నాడు.  ఇప్పుడు ఈ వార్త కేవలం తమిళనాటనే కాకుండా ఇండియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది. 

 పైగా  విజయ్ తన 69 వ సినిమాని నెల్సన్ కి ఇవ్వాలని సోషల్ మీడియా లో కామెంట్లు కూడా పెడుతున్నారు. నెల్సన్ ఇటీవల రజనీ కాంత్ తో  జైలర్ తెరకెక్కించాడు. సుమారు 10 సినిమాల తర్వాత రజనీకి హిట్ ఇచ్చిన ఘనతని దక్కించుకున్నాడు. విజయ్ తో బీస్ట్ కి కూడా ఆయనే దర్శకుడు.