English | Telugu
'నీ దారే నీ కథ' మూవీ రివ్యూ
Updated : Jun 13, 2024
నటీనటులు: ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.
సంగీతం: ఆల్బర్ట్టో గురియోలి
సినిమాటోగ్రాఫర్: ఎలెక్స్ కావు
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షిత తోట
ఎడిటర్: విపిన్ సామ్యూల్
రచయితలు: మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
దర్శకుడు: వంశీ జొన్నలగడ్డ
నిర్మాతలు: వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
బ్యానర్: జె వి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూన్ 14, 2024
ప్రియతమ్ మంతిని, సురేష్, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నీ దారే నీ కథ'. వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో తేజేష్ వీర నిర్మించిన ఈ సినిమాలో అజయ్, పోసాని కృష్ణ మురళి అతిథి పాత్రల్లో నటించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చితం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటారు. ఒక మంచి మ్యుజిషియన్ గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం చేయాలనేది అతని కోరిక. తనకు తన తండ్రి (సురేష్) సపోర్ట్ ఉంటుంది. తను అనుకున్నది సాధించే ప్రయత్నంలో.. తన టీమ్ లో ఉన్న ఒక ఫ్రెండ్.. టీమ్ నుంచి తప్పుకున్నప్పుడు తనకు సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. అర్జున్ తండ్రి తన కుమారుడిని ఒక మంచి మ్యూజిషియన్ గా చూడాలనుకుంటాడు. కానీ ఆయన మధ్యలో మరణిస్తాడు. తన తండ్రి కోరికని అర్జున్ నెరవేర్చాడా లేదా? తను అనుకున్నది సాధించి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసి మ్యూజిషియన్ అయ్యాడా లేదా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
వంశీ జొన్నలగడ్డ ఎంచుకున్న కథ బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తండ్రి కొడుకులు మధ్య బంధాన్ని చక్కగా చూపించారు. అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ ని పక్కన పెడితే.. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు మెప్పించాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఇంకా మెరుగ్గా ఉంది. అయితే క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగిస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సింక్ సౌండ్ అయినా కూడా ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎలెక్స్ కావు కెమెరా పనితనం పరవాలేదు. విపిన్ సామ్యూల్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాతలు విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా సురేష్ నిలుస్తారు. కొడుకుకి సపోర్ట్ చేసే తండ్రి పాత్రలో ఆయన నటన చాలా బాగుంది. ప్రియతమ్ కొత్తవాడైనా బాగా నటించాడు. ఇక ఫ్రెండ్ క్యారెక్టర్ లో విజయ్ విక్రాంత్ నవ్విస్తూ, ఎమోషన్ పండిస్తూ మంచి నటనని కనబరిచాడు. అంజనా బాలాజీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ బాగా నటించింది. అజయ్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమాకి సపోర్ట్ గా నిలిచారు.
ఫైనల్ గా..
తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీ కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 2.75/5
