English | Telugu

హిట్-3 కలెక్షన్స్.. నాని బాక్సాఫీస్ ఊచకోత!

హిట్-3 కలెక్షన్స్.. నాని బాక్సాఫీస్ ఊచకోత!

 

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నాని నటించిన మూవీ 'హిట్-3'. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. (Hit 3 Collections)

 

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'హిట్-3'.. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అదే జోరుని కొనసాగిస్తూ రెండో రోజు రూ.19 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.20 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ సాధించింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు. దీంతో మొదటి వీకెండ్ లోనే (నాలుగు రోజుల్లోనే) హిట్-3 రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది. గతంలో నాని నటించిన దసరా, సరిపోదా శనివారం ఈ ఫీట్ సాధించాయి. నాని కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా హిట్-3 నిలవనుంది. ప్రస్తుత వసూళ్ల జోరు చూస్తుంటే.. ఈ మూవీ నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

 

 

హిట్-3 కలెక్షన్స్.. నాని బాక్సాఫీస్ ఊచకోత!