English | Telugu

నాగార్జున, సిఎం రేవంత్ రెడ్డి మంతనాలు

నాగార్జున, సిఎం రేవంత్ రెడ్డి మంతనాలు

గత ఏడాది నవంబర్ లో ప్రముఖ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఎంగేజ్ మెంట్ జైనబ్ రవ్జి తో జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వివాహం జూన్ 6 న జరుగుతున్నట్టు తెలుస్తుంది. వివాహం తేదీ పై ఇప్పటి వరకు అధికారకంగా క్లారిటీ రాకపోయినా జూన్ 6 న పెళ్లి భాజాలు మోగడం ఖాయమనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో అక్కినేని వారి ఇంట పెళ్ళి సందడి నెలకొని ఉంది.

రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఆయన నివాసంలో నాగార్జున(Nagarjuna)కలిసి, తన కుమారుడు అఖిల్ వివాహ వేడుకకి రావాల్సిందిగా ఆహ్వానించాడు. అనంతరం రేవంత్ రెడ్డి, నాగార్జున   కాసేపు మాట్లాడుకున్నట్టుగా  తెలుస్తుంది. నాగార్జున తో పాటు ఆయన సతీమణి అమల, వధువు జైనబ్ రవ్జి(Zainad Ravdjee) తల్లితండ్రులు కూడా రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం లెనిన్(Lenin)అనే మూవీ చేస్తున్నాడు. రాయలసీమలోని  చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తుంది.