Read more!

English | Telugu

ఆ టైప్ మూవీలో నటిస్తున్న నాగచైతన్య...!

మన హీరోలందరూ ప్రస్తుతం రీమేక్ సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం మలయాళం సినిమా "ప్రేమమ్" రీమేక్ లో నటిస్తున్న నాగచైతన్య మరో రీమేక్ సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. గత శుక్రవారం తమిళనాట విడుదలైన "మెట్రో" అనే సినిమా ఓ మోస్తరు హిట్ సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాగచైతన్య.

చైన్ స్నాఛింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో హింసపాళ్ళు ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ వారు మొదట్లో సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. అలాంటి సినిమాను నాగచైతన్య ఎందుకు రీమేక్ చేయాలనుకొంటున్నాడో అర్ధం కావడం లేదు. అసలే నాగచైతన్యకి ఈ తరహా త్రిల్లర్స్, యాక్షన్ సినిమాలు అచ్చోచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రీమేక్ ఆలోచనను చైతూ వెనక్కి తీసుకొంటాడేమో చూడాలి!