Read more!

English | Telugu

కల్కి డైరెక్టర్ వీడియో వైరల్..ఇంతకీ డాన్స్ ఎందుకు వేసాడు

మొన్న కల్కి 2898 ఏడి(kalki 2898) నుంచి అమితాబ్ (amithab) క్యారక్టర్ అయిన  అశ్వద్ధామకి సంబంధించిన చిన్నపాటి టీజర్ రిలీజ్అయ్యింది. దాంతో ప్రభాస్ (prabhas) క్యారక్టర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ  అందరిలో మొదలయ్యింది. అసలు మూవీ కథ ఏంటి? కమల్ హాసన్ తో పాటు మిగతా క్యారక్టర్ లు ఎలా కనపడబోతున్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల మెదళ్ళకి పని చెప్తున్నాయి. ఎలక్షన్ హీట్ కంటే కూడా కల్కి హీటే ఎక్కువగా ఉందని కూడా చెప్పవచ్చు. వీటన్నిటికీ మూల కారకుడు ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు  ఆయనకీ సంబంధించిన  వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

 తాజాగా  నాగ్ అశ్విన్ (nag ashwin) పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. బంధు మిత్రుల సమక్షంలో జరిగిన ఈ  వేడుకల్లో నాగీ  సినిమా  హీరో లెవల్లో డాన్స్ వేసాడు. నాగార్జున హీరోగా వచ్చిన మాస్ లోని అన్న నడిచొస్తే మాస్  పాటకి స్టెప్ లు  ఇరగదీసాడు. అంతే కాకుండా  పవన్ కళ్యాణ్  హీరోగా వచ్చిన తమ్ముడు లోని వయ్యారి భామ నీ హంస నడక పాటకి తన భార్య ప్రియాంక దత్ తో కలిసి చిందులేశాడు.ఆమె కూడా నిర్మాతగా పలు చిత్రాలని నిర్మించింది. తను  అగ్ర నిర్మాత అశ్వని దత్ కూతురు

 కల్కి తో అశ్విన్  ఒక కొత్త ప్రపంచాన్ని ఇండియన్ ప్రేక్షకులకి చూపించబోతున్నాడు.గత చరిత్రకి సైన్స్  ఫిక్షన్ ని జోడించి తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. కల్కి గా ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాము అనే నమ్మకంతో ఉన్నారు. మే 9 రిలీజ్ అని ప్రకటించారు గాని  ఎలక్షన్స్ దృష్ట్యా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వైజయంతి బ్యానర్ పై అశ్వనిదత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. దీపికా పడుకునే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.