Read more!

English | Telugu

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటి డేట్! 

 భాష, బడ్జట్ ,క్యాస్టింగ్ ల తో సంబంధం లేని  సూపర్ హిట్ చిత్రాలు తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద అప్పుడప్పుడు మెరుస్తుంటాయి. అలా మెరిసిన  ఒక చిత్రమే మంజుమ్మల్ బాయ్స్(Manjumel boys) ఏప్రిల్ 5 న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

 ప్రముఖ దిగ్గజ  సంస్థ డిస్నీ + హాట్ స్టార్  మంజుమ్మల్ బాయ్స్ ని  సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ గతంలోనే సంస్థ అధికారకంగా ప్రకటించింది. ఇక  ఇప్పడు మే 3 నుంచి  ఓటిటి లో విడుదల కావడానికి ముస్తాబు అవుతుంది. ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో అధికారకంగా ప్రకటన కూడా రానుంది. మలయాళం తో పాటు తెలుగులోను అదే డేట్ కి విడుదల కాబోతుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వస్తుండటంతో  మూవీ లవర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.    

2006 లో కేరళ కి చెందిన కొంత మంది యువకులు  తమిళనాడులోని గుణ గుహాలకి వెళ్తారు. అందులోని ఒక యువకుడు  గుహలో పడిపోతాడు. ఈ పాయింట్ తోనే  మంజుమ్మల్ బాయ్స్ బాయ్స్ తెరకెక్కింది. ఫిబ్రవరి లో మలయాళం లో రిలీజ్  అయ్యి  300 కోట్లకి పైగానే వసూ లు చేసింది.తెలుగు లో కూడా మంచి కలెక్షన్లని రాబడుతుంది.  సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితరులు నటించగా చిదంబరం దర్శకత్వం వహించాడు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది.