English | Telugu
అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గ్రూప్ నుంచి డిలీట్ అయిన మంచు విష్ణు
Updated : Jun 19, 2025
మంచు విష్ణు(Vishnu)కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'(Kannappa). 'తిన్నడు' అనే నాస్తికుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి ప్రాణాలని సైతం అర్పించే 'కన్నప్ప' గా, మారడానికి గల కారణాలు ఏంటనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 27 న రిలీజ్ అవుతున్న సందర్భంగా విష్ణు పలు చోట్ల జరిగే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతు ఎన్టీఆర్(Ntr)రామ్ చరణ్(Ram Charan)బన్నీ(Bunny),రానా(Rana)తో కలిసి నేను పెరిగాను. బన్నీ, రానా ఒక వాట్స్ అప్ గ్రూప్ ని ప్రారంభించారు. ఆ గ్రూప్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. దీంతో నాకు చాట్ చెయ్యాలంటే సిగ్గుగా అనిపించేది. ఏదైనా ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చెయ్యండని బన్నీ, రానా కి చెప్పి నేను గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. ఎవరకి ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో కలిసిపోయేంత ఎమోషనల్ రిలేషన్ షిప్ మా మధ్య ఉందని విష్ణు చెప్పుకొచ్చాడు.
కన్నప్పట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో సినిమా గ్యారంటీ హిట్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, వంటి మేటి నటులు కూడా కన్నప్ప లో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అదనపు క్రేజ్ కూడా వచ్చింది. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా కనిపిస్తుంది. మహాభారతం ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(Mukeshkumar Singh)దర్శకత్వంలో విష్ణు , మోహన్ బాబు అత్యంత భారీ వ్యయంతో కన్నప్ప ని నిర్మించారు.
