English | Telugu
ఆల్కహాల్ తాగుతూ దొరికిపోయిన నటి
Updated : Nov 28, 2023
2015 లో మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసిన నటి మడొన్నా సెబాస్టియన్. ఈ ప్రేమమే ఆతర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా వస్తే అందులో కూడా నటించి తెలుగు ప్రేక్షకులని పలకిరించింది.ఆ తర్వాత తమిళ ,మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసిన మడోన్నా కి అంత గుర్తింపు రాలేదు. నాని హీరో గా తెరకెక్కిన శ్యాం సింగరాయ్ లో కూడా మడోన్నా నటించింది. తాజాగా ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ లియో లో విజయ్ అక్కగా నటించి మంచి గుర్తింపుని పొందింది. ఇప్పుడు ఈ భామకి చెందిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఆల్కహాల్ సేవిస్తు ఉన్న తన పిక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో మడోన్నా చేతిలో మందు గ్లాస్ ఉంటడం తో పాటు అందులో ఆల్కహాల్ ఉంది. కాకపోతే గ్లాస్ లోపల ఉంది విస్కీనో, బ్రాందినో. లేక రమ్మో అనే విషయం తను చెప్పలేదు. పైగా మందు తాగిన తర్వాత తనకి బలం వచ్చినట్టుగా తన కండల్ని కూడా మడోన్నా చూపించింది. ఇప్పుడు ఈ పిక్ చూస్తున్న వాళ్ళందరు మడోన్నా మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
లియో ఫ్యామిలీ అంటే ఇంతే , హెలీనా దాస్ బ్యాడ్ యాస్ అని ,లియో 2 కోసం వెయిటింగ్ మేడం అని ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు .లియో లో విజయ్ అక్కగా మడోన్నా కనపడింది కొంచం సేపే అయినా కూడా మడోన్నా కి మంచి పేరే వచ్చింది.
