English | Telugu

కుబేర ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే..పోస్టర్ రిలీజ్ చేసిన టీం 

కుబేర ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే..పోస్టర్ రిలీజ్ చేసిన టీం 

అక్కినేని నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)రష్మిక(Rashmika Mandanna), శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కాంబినేషన్ లో ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'. అన్ని భాషల్లోను హిట్ టాక్ ని తెచ్చుకున్న కుబేర ఒక  మిలినియర్ , బిచ్చగాడి కి మధ్య జరిగిన ఒక వినూత్న కథాంశంతో తెరకెక్కింది. నాగార్జున, ధనుష్, రష్మిక తో పాటు మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని మూవీ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్తున్నాడు.

ఇక ఈ మూవీ రీసెంట్ గా వంద కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం కూడా ఈ మేరకు అధికారకంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఫస్ట్ వీక్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే 100 కోట్ల క్లబ్ లో కి చేరడంతో మూవీకి ప్రేక్షకుల్లో లభిస్తున్న అదరణని అర్ధం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిత్ర యూనిట్ కూడా ఈ  విషయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి, అమిగోస్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించిన కుబేర లో జిమ్ సర్బ్, షాయాజీ షిండే, దిలీప్ తాహిల్, భాగ్యరాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్(Devi sriprasad)సంగీతాన్ని అందించాడు. 

 

 

కుబేర ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే..పోస్టర్ రిలీజ్ చేసిన టీం