Read more!

English | Telugu

ఓటీటీలోకి దర్శన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీలోకి వచ్చే సినిమాల జాబితా రోజురోజుకి ఎక్కువైంది. ప్రేక్షకులకి ఏ సినిమా చూడాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఏంటో ఓసారి చూసేద్దాం...

కన్నడ నటుడు యష్ నటించిన 'కెజీఎఫ్' తో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా ' కాటేరా'. కన్నడ నటుడు దర్శన్ హీరోగా నటించిన మూవీ ' కాటేరా'. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం అందుకుంది. దాదాపు వందకోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు అంచనా ఉంది. ఈ మూవీ ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి తెలుగు, తమిళ వర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  1970 లో కర్నాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 'కాటేరా'  మూవీని తీసినట్టుగా దర్శకుడు తరుణ్ సుధీర్ తెలిపాడు. 

అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మాలాశ్రీ కుమార్తె  ఆరాధన రామ్ చేసింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. రాక్ లైన్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా చేసాడు. వి హరికృష్ణ మ్యూజిక్ అందించగా సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించాడు. కథ, కథనం చక్కగా కుదరడంతో ఈ సినిమా కన్నడ మూవీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా ఓటీటీలోకి వచ్చేసింది.‌ మరెందుకు లేటు ఈ వీకెండ్ లో ఈ మూవీని చూసేయ్యండి.