Read more!

English | Telugu

ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల శివ క్షమాపణలు..

మిర్చితో ఎంట్రీ ఇచ్చి..శ్రీమంతుడితో రికార్డులు తిరగరాసి..టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా జనతా గ్యారేజ్. శ్రీమంతుడి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో పాటు మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

సినిమా ముహూర్తం షాట్ రోజునే 2016 ఆగష్టు 12న మూవీ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేయడంతో ఇంకేముంది అతి త్వరలో సినిమా వచ్చేస్తుంది అనుకున్నారు జూనియర్ అభిమానులు. అయితే ఉన్నట్లుండి సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 2కు మారింది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఒక మంచి సినిమాని తీశాం కాని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కారణంగా తేదీని కొంచెం మార్చాల్సి వస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, వారందరికి సారీ చెబుతున్నా అంటూ దర్శకుడు కొరటాల మీడియా సాక్షిగా అన్నారు.