English | Telugu

పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడా!

పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veera mallu)రిలీజ్ డేట్ ఎన్నిసార్లు వాయిదా పడిందో  తెలిసిందే. చారిత్రాత్మక నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ టైం పోరాటయోధుడుగా చేస్తున్న పవన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఎప్పటిప్పుడు వాళ్ల ఆశలన్నీ అడియాసలు అవుతు వస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఓజి'(Og)పరిస్థితి కూడా ఇంతే. 

ఈ రెండు మూవీలు కొంత భాగం షూటింగ్ ని జరుపుకున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం వీరమల్లు నే జరుపుకుంది. మే 9 న రిలీజ్ అని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ డేట్స్  ఇచ్చాడు. తెలంగాణలోని కొత్తగూడంలో షూట్ కి ప్లాన్ చేసారు. కానీ పవన్ కొడుకు మార్క్ శంకర్ గాయపడటంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో మే 9 నుంచి కూడా వీరమల్లు వెనక్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు మేకర్స్ కి పవన్ నుంచి హామీ వచ్చినట్టుగా తెలుస్తుంది. తన సీన్స్ కి  సంబంధించి ఉన్న ప్యాచ్ వర్క్ త్వరగా పూర్తి చేసుకోమని పవన్  చెప్పాడని, మేకర్స్ షూట్ కి రెడీ అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరమల్లు రిలీజ్ మే సెకండ్ వీక్ లో గాని, జులై ఫస్ట్ వీక్ లో గాని ఉండవచ్చని అంటున్నారు.

ఇదే రీతిలో 'ఓజి' నిర్మాతల్ని కూడా షూట్ కి రెడీ చేసుకోమని చెప్పాడని సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీంతో అన్ని అనుకున్నట్టుగా కుదిరితే  సెప్టెంబర్ 5 న ఓ జి ని థియేటర్స్ లోకి  తీసుకొచ్చే  ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా ఈ రెండు చిత్రాల నిర్మాతలకి పవన్ మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ  సారైనా పవన్  తన మాటని నిలబెట్టుకుంటాడా అనే చర్చ సినీ సర్కిల్స్ లో నడుస్తుంది. అభిమానులు మాత్రం రెండు చిత్రాల షూటింగ్ ని పవన్ కంప్లీట్ చేసి సిల్వర్ స్క్రీన్ పై తమని అలరించాలని కోరుతున్నారు. వీరమల్లు ని ఎ ఎం రత్నం(Am Rathnam) నిర్మిస్తుండగా క్రిష్(Krish),జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహిస్తున్నారు. ఓజి కి  ఆర్ఆర్ఆర్ దానయ్య(Dvv Danayya)నిర్మాత కాగా సుజిత్(Sujeeth) దర్శకుడు.    

 

   

 

పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడా!