English | Telugu
హరిహర వీరమల్లు పండుగ ముందుగానే వచ్చేస్తుంది..ఇక వాళ్ళకి నో విశ్రాంతి
Updated : May 26, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)తన ఎంటైర్ సినీ కెరీర్ లో ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu).రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి పార్ట్ 1 'స్వార్డ్ అండ్ స్పిరిట్' అనే క్యాప్షన్ తో జూన్ 12 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా బాబీడియోల్, సత్యరాజ్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందించాడు.
ఆయన సంగీత సారధ్యంలో తెరకెక్కిన సాంగ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు మూడు సాంగ్స్ విడుదలయ్యాయి. ఈ మూడు కూడా అభిమానులు, ప్రేక్షకులకి ఎంతగానో చేరువయ్యాయి. ఇప్పుడు నాలుగో సాంగ్ ఈ నెల 28 న ఉదయం 10 :28 నిమిషాలకి విడుదల కానుంది. తార, తార అనే లిరిక్ తో కూడిన ఈ సాంగ్ రిలీజ్ గురించి ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'ఈ సంవత్సరం అత్యంత హాటెస్ట్ ట్రాక్‌ని వినడానికి సిద్ధంగా ఉండండంటు అధికారికంగా వెల్లడి చేసారు.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయింది. ఎందుకంటే హరిహర వీరమల్లు నుంచి ఇప్పటి వరకు రిలీజైన సాంగ్స్ కంటే తార తార సాంగ్ చాలా బాగుంటుందని, ఇటివల మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ ని వింటామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. క్రిష్,జ్యోతికృష్ణ(Jyothi Krishna)సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన హరిహరవీరమల్లుని హిట్ చిత్రాల నిర్మాత ఏ ఎం రత్నం, ఆయన సోదరుడు దయాకర్ తో కలిసి సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించాడు.
