Read more!

English | Telugu

మళ్ళీ వార్తల్లోకి  హనుమాన్.. అసలు నిజం తెలుసుకుంటే మీ పరిస్థితి ఏంటి  

ఇప్పుడు అంజనాదేవి మానస పుత్రుడు హనుమాన్ (hanuman)హీరోలకే హీరో అయ్యాడు.ఇదీ నా రేంజ్ అంటున్నాడు.తగ్గేదేలే అని కూడా చెప్తున్నాడు. నేను తలుచుకుంటే ఆల్ రికార్డ్స్ మటాష్ అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. అసలు  హనుమాన్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.ఇంతకీ ఏం సాధించాడో చూద్దాం

తేజ సజ్జ (teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (prashanth varma) దర్శకత్వంలో మొన్న  సంక్రాంతికి వచ్చిన మూవీ హనుమాన్. టైటిల్ కి తగ్గట్టే హనుమాన్ ని ప్రధాన కథా వస్తువుగా ఎంచుకొని మూవీ తెరకెక్కింది. అంటే హనుమాన్ ని కూడా ఒక హీరోగా భావించవచ్చు.విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 330 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ ని రాబట్టి  కలెక్షన్ల సునామీనే  సృష్టించింది. ఇక లేటెస్ట్ గా మరో అరుదైన ఘనతని దక్కించుకుంది .మొత్తం  25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా  తమ విజయంలో భాగమైన హనుమంతుడికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ప్రస్తుత సినీ యుగంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మూడు నాలుగు వారాలకే పరిమితమవుతుంది. అలాంటిది హనుమాన్ 100 రోజులు జరుపుకోవడం గ్రేటే. పైగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హనుమాన్ గత నెలలో ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా సరే 100 రోజులుని  జరుపుకుంటుంది.దీన్ని బట్టి  హనుమాన్ ఎంత శక్తిమంతుడో  అర్ధం అవుతుంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. 50 రోజులని 150 థియేటర్స్ లో జరుపుకుంది.