English | Telugu

శ్రీరాముని కోసం హనుమాన్.. ఎన్ని కోట్లో తెలుసా?

శ్రీరాముని కోసం హనుమాన్.. ఎన్ని కోట్లో తెలుసా?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్ లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సూపర్ హీరో ఫిల్మ్ భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా.. త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ ని అందుకోనుంది.

కాగా, అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టిక్కెట్ నుండి 5 రూపాయలను విరాళంగా ఇస్తామని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హనుమాన్ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటను మేకర్స్ నిలబెట్టుకుంటున్నారు. వారు సినిమా ప్రీమియర్ షోలకు విక్రయించిన 2,97,162 టిక్కెట్ల నుండి రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఇక తాజాగా ఇప్పటి వరకు విక్రయించిన మొత్తం 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు.

సినిమా బాగుండటంతో పాటు..  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నట్లుగా అయోధ్యలోని రామ మందిరానికి ప్రతి టిక్కెట్ నుండి రూ. 5 ఇవ్వడం పట్ల హనుమాన్ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

శ్రీరాముని కోసం హనుమాన్.. ఎన్ని కోట్లో తెలుసా?