English | Telugu

Grrr review: గర్‌ర్‌ర్ మూవీ రివ్యూ

Grrr review: గర్‌ర్‌ర్ మూవీ రివ్యూ

 

 

మూవీ : గర్‌ర్‌ర్
నటీనటులు: సూరజ్ వెంజరమూడు, కుంచాకో బోబన్, శృతి రామచంద్రన్, అనఘ, రాజేష్ మాధవన్ , మంజు పిళ్ళై తదితరులు
మ్యూజిక్: కాళిదాస్ మీనన్, టోనీ టార్జ్
సినిమాటోగ్రఫీ: జమేశ్ నాయర్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాతలు:  షాజీ నటేసన్, ఆర్య
దర్శకత్వం: జై కే
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ : 

కేరళలోని తిరువనంతపురంలో రెజిమన్ నాడర్(కుంచాకో బోబన్) తన ప్రేయసి రచన(అనఘ) కోసం ఎదురుచూస్తుంటాడు.  అయితే రచన వాళ్ళ నాన్న ఆ ప్రాంతంలోనే ప్రముఖ లీడర్. అతను ఎన్నికల్లో నిల్చోవడం కోసం , ఓ ముఖ్యమైన పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అదే సమయంలో తన కూతరు రచన ఎవరితోనే ప్రేమలో ఉందని డౌట్ పడతాడు. అయితే పెళ్ళి కోసం రెజిమోన్ తో రచన ముందుగానే చెప్పి ఉంటుంది. అయితే ఆ రోజంతా తన ఫోన్ స్విఛ్చాఫ్ లో ఉంటుంది‌. దాంతో  అమ్మాయి తనని మోసం చేసిందని రెజిమోన్  భావించి , బాగా తాగుతాడు. ఇక తన ఫ్రెండ్ తో పాటు కారులో వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని డైవర్షన్ తోసుకొని 'జూ' దగ్గర ఆగుతారు. దాంతో రెజిమోన్ ఆ జూ లోని సింహపు గుహ ఉండే చోటులోకి అడుగుపెడతాడు. అదే సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న హరిదాస్ నాయర్( సూరజ్ వెంజరమూడు) చూస్తాడు. ఆ తర్వాత అతడిని కాపాడటానికి వెళ్తాడు. మరి హరిదాస్ అతడిని కాపాడాడా? రెజిమోన్ ప్రేమ ఫలించిందా? రచన వాళ్ళ నాన్న ఎన్నికల్లో నిల్చున్నాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

గర్‌ర్‌ర్ ఈ టైటిల్ వినగానే గురక సమస్య అని అనుకుంటారంతా కానీ అది సింహపు గర్జన. దర్శకుడు జై.. ఓ చిన్న పాయింట్ ని తీసుకొని కథని మలిచాడు. కానీ అది అంతగా ప్రేక్షకుడికి నచ్చేలా ప్రెజెంట్ చేయలేకపోయాడు.

కథ మొదలైన ముప్పై నిమిషాల వరకు అలా సాగుతుంది. అయితే సింహం ఎంటర్ అయినప్పటి నుండి కథలో వేగం పుంజుకుంది. కానీ దర్శకుడు సీరియస్ మ్యాటర్ ని కామెడీగా చూపించాలనుకున్నాడు. అది అంతగా సెట్ అవ్వలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా సింపుల్ గా తేల్చేశారు. ప్రేమకథని కూడా ప్రాపర్ గా చెప్పలేకపోయారు. ప్రధాన పాత్రలకి తెలుగు డబ్బింగ్ అంతగా  సెట్ అవ్వలేదు. 

సింహం కన్పించే సీన్లని చాలా సహజంగా చూపించారు‌‌. అర్థం లేని కామెడీ సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచింది. కథ నిడివి రెండు గంటలే అయిన.. ఇంకా ఎప్పుడూ ముగుస్తుందనే భావన ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. ప్రేమకథని పాలిటిక్స్ తో లింక్ చేసి వచ్చిన సినిమాలు ఇప్పటికే బోలెడు వచ్చాయి. అవే కాస్త బెటర్ గా ఉంటాయి. ముంజమ్ముల్ బాయ్స్ సినిమాని ప్రేరణగా తీసుకొని చేద్దామని అనుకున్నాడు దర్శకుడు కానీ దానంత ఇంపాక్ట్ చేయలేకపోయాడు. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు వాడలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఒకే. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

రెజిమోన్ నాడర్ గా కుంచాకో బోబన్, హరిదాస్ నాయర్ గా సూరజ్ వెంజరమూడు, మృదులా నాయర్ గా శృతి రామచంద్రన్ , రచనగా అనఘ ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : గుడ్ పాయింట్ బట్  బోరింగ్ ప్రెజెంటేషన్.. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్: 2/5 

✍️. దాసరి మల్లేశ్