English | Telugu
చిరంజీవి గారి వల్లే నాలో అది పోయింది.. వీరసింహారెడ్డి దర్శకుడి కీలక వ్యాఖ్యలు
Updated : Apr 30, 2025
మాస్ మహారాజా రవితేజ(Raviteja)కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'డాన్ శ్రీను' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్ మలినేని(Gopichand malineni).ఆ తర్వాత బాడీగార్డ్, విన్నర్, పండగ చేస్కో, క్రాక్, వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అగ్ర హీరో సన్నీడియోల్ తో 'జాట్'(Jaat)ని తెరకెక్కించి హిట్ ని అందుకొని బాలయ్యతో రెండోసారి చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
రీసెంట్ గా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు సహాయ దర్శకుడుగా వర్క్ చేస్తున్నప్పుడు మొహమాటం వల్ల ఎవరితోను ఎక్కువగా మాట్లాడే వాడ్ని కాదు. దాంతో చాలా మంది నాకు పొగరు అనుకునే వాళ్ళు. 'చిరంజీవి' గారితో అందరి వాడు, స్టాలిన్ వంటి సినిమాలకి పని చేశాను. ఒకరోజు అందరివాడు షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారు నన్ను పిలిచి నీ గురించి చాలా షాట్స్ వన్ మోర్ చేశాను. నీ ఫేస్ లోని ఎక్స్ ప్రెషన్స్ ద్వారా షాట్ నీకు నచ్చిందో లేదో తెలిసిపోతుంది. నువ్వు చాలా మంచిగా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నావ్. కాకపోతే సైలెంట్ గా ఉండకు. నువ్వు అనుకున్నది బయటకి చెప్పు. నేను వెతుక్కొని నిన్ను పిలవటం కాదు. నువ్వే నా దగ్గరకొచ్చి చెప్పాలి.
నీలో టాలెంట్ ఉందని నీకు తెలుసు. జనాలకి తెలియదు కదా. నీ టాలెంట్ ని ఎక్స్ ప్రెస్ చేస్తేనే నీ టాలెంట్ విషయం తెలుస్తుందని చెప్పారు. దాంతో చిరంజీవి గారు చెప్పినట్టు స్టాలిన్ సినిమాకి నేను ఏమనుకుంటున్నానో అది బయటకి చెప్పేవాడిని. దాంతో నా మైండ్ సెట్ మారడంతో పాటు నాలో కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగి నా లైఫ్ మారిందని చెప్పుకొచ్చాడు.
