English | Telugu
‘యానిమల్’ కథను ఈజీగా రిజెక్ట్ చెయ్యొచ్చు.. షాక్ ఇచ్చిన సందీప్‌రెడ్డి!
Updated : Nov 28, 2023
ఒక్క కథతోనే స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకోవడం అనేది అసాధ్యం. అయితే ఆ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆ ఒక్క కథతోనే తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ చేశాడు, హిందీలో ‘కబీర్ సింగ్’ చేశాడు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ విజయం సాధించి టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఆ రెండు సినిమాలు సాధించిన ఘనవిజయాలతోనే సందీప్‌రెడ్డి చేసిన తాజా చిత్రం ‘యానిమల్’కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందులోనూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు సందీప్.
‘యానిమల్’ సినిమాను ఒక కథగా చెబితే ఏ హీరో అయినా చాలా ఈజీగా రిజెక్ట్ చేసెయ్యొచ్చు. ఈ కథలో లాజిక్కులు ఎక్కడు ఉన్నాయి? డ్రామా ఇలా ఉందేంటి? ఇలాంటి కారణాలతో కథనుఎంతో ఈజీగా రిజెక్ట్ చేసెయ్యొచ్చు. కానీ, రణబీర్ అలా చేయలేదు. కథను నమ్మాడు, ఆ తర్వాత నన్ను ఎక్కువ నమ్మాడు. సినిమా పూర్తయ్యేవరకు నాతోనే ట్రావెల్ చేశాడు. ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి అసలు టెన్షన్ వద్దు. అలాగే సినిమా ఫస్ట్‌లో వచ్చే సీన్స్ అసలు మిస్ కావద్దు. ముగింపు కూడా చాలా ఇంపార్టెంట్ మిస్ అవ్వొద్దు. సినిమా మొత్తం చూడాలని ఇలా చెప్పడం లేదు. సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. సినిమా చూసిన తర్వాత మీకు మంచి ఫీల్ వస్తుంది’’ అన్నారు సందీప్‌రెడ్డి.
