English | Telugu

ఆ హీరో కూతురి రెండో పెళ్లి ఈ డైరెక్టర్ తోనే 

ఆ హీరో కూతురి రెండో పెళ్లి ఈ డైరెక్టర్ తోనే 

తమిళ చిత్ర సీమని ఏలిన ఎంతో మంది నటుల్లో శివాజీ గణేశన్ ష్ కూడా ఒకరు.ఎన్నో సినిమాల్లో తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనని ప్రదర్శించి తమిళ ప్రజల గుండెల్లో  నేటికీ ఆయన కొలువుతీరి ఉన్నారు. ఆయన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన  నటుడు ప్రభు.  90 వ దశకంలో వచ్చిన ఎన్నో హిట్ సినిమాల్లో  హీరోగా నటించి తన తండ్రి లాగానే అశేష అభిమానులని సంపాదించాడు. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు బాషల కి చెందిన సినిమాల్లో నటిస్తు తన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రభుకి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పేరు విక్రమ్..విక్రమ్ ప్రభు పేరుతో పలు సినిమాల్లో నటిస్తు మంచి పేరు ని సంపాదిస్తున్నాడు. ప్రభు కూతురు పేరు ఐశ్వర్య. తనకి 2019 వ సంవత్సరంలో  దగ్గరి బంధువుతో  వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన భర్త తో కలిసి అమెరికాలో స్థిరపడిన ఐశ్వర్య ఆ తర్వాత మనస్పర్ధలతో విడిపోయి  ఇండియా వచ్చి ప్రభు దగ్గరే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఐశ్వర్య రెండో వివాహం చేసుకోబోతుంది. తమిళ చిత్ర  దర్శకుడు అధిక్ రవి చంద్రన్ తో ఐశ్వర్య త్వరలోనే ఏడడుగులు కలిసి నడవబోతుంది. ఇటీవలే ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

ఇక అధిక్ రవి చంద్రన్ విషయానికి వస్తే లేటెస్ట్ గా విశాల్ హీరో గా వచ్చిన మార్క్ ఆంటోనీ కి రవి చంద్రన్ దర్శకత్వం వహించాడు. త్రిష ఇల్లన నయనతార అనే మూవీతో తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన రవి చంద్రన్ తమిళ సూపర్ స్టార్  అజిత్ తో కూడా త్వరలోనే  ఒక సినిమా చెయ్యబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 

ఆ హీరో కూతురి రెండో పెళ్లి ఈ డైరెక్టర్ తోనే