English | Telugu

డియర్ నాన్న మూవీ రివ్యూ

డియర్ నాన్న మూవీ రివ్యూ

 

మూవీ : డియర్ నాన్న
నటీనటులు: చైతన్య రావు, సూర్య కుమార్ భగవాన్ దాస్, సి.వి.ఎల్ నరసింహారావు, సంధ్య జనక్, మధు నందన్, శశాంక్, యశ్న చౌదరి, వినయ్ నల్లకాడి తదితరులు
ఎడిటింగ్:  శ్రావణ్ కాటినేని
సినిమాటోగ్రఫీ: అనిత్ కుమార్ మాధాడి
మ్యూజిక్: జిఫ్టన్ ఎలియాస్
 నిర్మాత: రాకేశ్ మహంకాళి
స్టోరీ & దర్శకుడు: అంజి సలాధి
ఓటీటీ : ఆహా

కథ: 

సూర్య చెఫ్ అవ్వాలని డ్రీమ్ తో సీరియస్ గా జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అతని నాన్న రవి మెడికల్ షాప్ రన్ చేస్తుంటాడు. అమ్మ గృహిణి.  నాన్నకి  రెస్ట్ ఇవ్వాలని, తను మంచి జాబ్ తెచ్చుకొని ఇల్లు చూసుకోవాలని కలలు కంటాడు సూర్య. అయితే సూర్య వాళ్ళ నాన్న రవికి మెడికల్ షాప్ రన్ చేయడం వృత్తి కాదని తన ఎమోషన్ అంటు గడుపుతుంటాడు. నిత్యం తన వద్దకు వచ్చే కస్టమర్స్ మెడిసిన్స్ టైమ్ కి ఇవ్వాలని తాపత్రయపడతాడు. అయితే కరోనా లాక్ డౌన్ వస్తుంది. అందులో ఎంతోమంది భయపడి మెడికల్ షాప్స్ క్లోజ్ చేస్తారు. మరికొంత మంది భయపడి జాబ్ మానేస్తారు. అయితే సూర్య వాళ్ళ నాన్న రవి మాత్రం కరోనా పేషెంట్స్ కి మెడిసిన్స్ ఇవ్వడం కోసం షాప్ ని రన్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు సూర్య వాళ్ళింట్లో అనుకోని సంఘటన జరుగుతుంది. అందరి బాగుకోసం తాపత్రయపడే రవికి ఏం జరిగింది? సూర్య తన నాన్న డ్రీమ్ ఏంటో తెలుసుకోగలిగాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రతీ కుటుంబంలోని పిల్లలకు నాన్నే సూపర్ హీరో.. అలాంటి నాన్న జీవితాన్ని అందంగా, అద్భుతంగా, ప్రతీ ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఫ్రెష్ కంటెంట్, తక్కువ నిడివితో పాటు సాంగ్స్, ఫైట్స్ లేకుండా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. ఓ మెడికల్ షాప్ లో మొదలైన నాన్న ప్రయాణం.. తనతో పాటు ఎందరికో స్పూర్తి అని చెప్తూనే.. దేశంలోని అన్ని మెడికల్ షాప్స్ కి ఒక్కరోజు సెలవు ఇస్తే ఏమవుతందనే సీరియస్ మెసెజ్ ని కూడా ఇచ్చారు మేకర్స్.

కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలతో పోరాడారు. చాలావరకు చనిపోగా కొంతమంది కరోనాతో పోరాడి బ్రతికారు. అందులో మెడికల్ షాప్స్ వాళ్ళు చేసిన త్యాగాన్ని చెప్పుకొచ్చారు.  రెగ్యులర్  గా బిటెక్ చదివి .. ఓ ఐటి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి పెళ్ళి చేసుకోవాలని చాలామంది కుర్రాళ్ళు కలలు కంటారు. ఎంతమంది తమ నాన్నల డ్రీమ్ ని నెరవేర్చారనేది చెప్తూనే కథని సాగించారు. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా అడల్ట్ సీన్స్ లేకుండా, ఎక్కడా ల్యాగ్ అవ్వకుండా, బోర్ తెప్పించకుండా అలా చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చోబెట్టేశారు.

ప్రాణాలని కాపాడే డాక్టర్స్ పాటు నిత్యం మెడిసిన్స్ సప్లై చేసే మెడికల్ షాప్స్ కీలకం అంటు సాగే కథనం ఆసక్తికరంగా సాగింది. రెగ్యులర్ యాక్షన్ , సస్పెన్స్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. శ్రావణ్ కాటినేని ఎడిటింగ్ నీట్ గా ఉంది. అనిత్ కుమార్ మాధాడి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 


సూర్య పాత్రలో చైతన్యరావు ఆకట్టుకున్నాడు. సూర్య వాళ్ళ నాన్న రవి పాత్రలో సూర్య కుమార్ భగవాన్ ఒదిగిపోయాడు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : తక్కువ నిడివితో ఉన్న ఈ ఎమోషనల్ డ్రామాని కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

రేటింగ్: 2.75 / 5

✍️. దాసరి మల్లేశ్