Read more!

English | Telugu

‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్: డెడ్ పిక్సెల్స్
నటీనటులు: నిహారిక కొణిదెల, హర్ష చీముడు, అక్షయ్ లఘుసాని, సాయి రోనాక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీతం: సిద్దార్థ సదాశివుని
రచయిత: అక్షయ్ పుల్ల
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
నిర్మాతలు: సమీర్ గోగటె, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడ
బ్యానర్: బిబిసి స్టుడియోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమడ మీడియా ప్రైవేట్ లిమిటెడ్.
డైరెక్టర్: ఆదిత్య మండాల
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:

గాయత్రీ మొదటగా ఒక అబ్బాయితో డేట్ కి వెళ్తుంది. అక్కడ గాయత్రీ ఫ్రెండ్ ఐశ్వర్య తనని గైడ్ చేస్తుంటుంది. అయితే అంతా బాగుందనే టైంలో గాయత్రీ అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఏమైందని ఆ డేట్ కి వచ్చిన అబ్బాయి అడిగితే వాళ్ళ ఇల్లు కాలిపోతుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక గేమ్ ఆడటం కోసం గాయత్రీ వెళ్తుంది. అయితే గాయత్రీ, భార్గవ్, ఐశ్వర్య ఒకే రూంలో ఉంటూ వేరు వేరు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో గాయత్రీ(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లఘుసాని) ఇద్దరు ఒకే గేమ్ ఆడతారు. అదే 'ది బ్యాటిల్ ఆఫ్ త్రోన్స్' అనే గేమ్. దీనిలో ఆనంద్(వైవా హర్ష) లీడ్ గా ఉంటాడు. అయితే ఈ ముగ్గురు కలిసి గేమ్ ని ఫినిష్ చేసారా? లేక వారి పర్సనల్ లైఫ్ కోసం త్యాగం చేశారా? లేదా అని తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ: 

మనం చిన్నప్పటి నుండి ఏదో ఒక‌ గేమ్ కి అడిక్ట్ అవుతుంటాం. అలా మనకి ఇష్టమైన గేమ్స్ లలో బయట గ్రౌండ్ లో ఆడే ఫిజికల్ గేమ్స్ ఒకటైతే.. మొబైల్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ కూడా ఉన్నాయి.  ఈ కథ ఒక కంప్యూటర్ గేమ్ ఆధారంగా రూపొందింది.  ఒక కంప్యూటర్ గేమ్ కి ముగ్గరు అడిక్ట్ అయితే ఎలా ఉంటుందోననే ఆసక్తికరమైన అంశంతో ఈ సిరీస్ ను తీర్చిదిద్దాడు ఆదిత్య మండాల. ప్రతీ కథలో ఒక పాస్ట్ ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఈ సిరీస్ లో గాయత్రీ, భార్గవ్, ఆనంద్ అనే ముగ్గరు వ్యక్తులు బయట మనుషులతో మాట్లాడకుండా గేమ్ ని ఆడుతూ టైం స్పెండ్ చేస్తుంటారు. అయితే అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక మంచి స్ర్కీన్ ప్లే రైటింగ్ తో ఆకట్టుకుంది 'డెడ్ పిక్సెల్'. 

గాయత్రీగా కొణిదెల నిహారిక తన నటనతో నిజంగా ఒక గేమర్ ఇంతలా అడిక్ట్ అవుతారా అనేంతలా చేసింది. ఒక గేమ్ ఆడటం కోసం ఈ ముగ్గురు.. ఫుడ్ ని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని స్టోర్ చేసుకుని తినే రోజులని గడుపుతున్నప్పుడు జాలేస్తుంది.  రెండు పూటల తినకుండా.. నిద్ర మానుకొని గేమ్ లు ఆడేవారికి ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. 

ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్‌ లుగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ లో బిగ్ గ్రీన్ ఉమెన్ గా వచ్చిన రోషన్ కి గేమ్ రూల్స్ వివరిస్తారు గాయత్రీ, భార్గవ్, ఆనంద్. రెండవ ఎపిసోడ్‌లో గేమ్ లో పరిచయమైన మదర్ లెస్ బాయ్ అనే క్యారెక్టర్ ని ఏకంగా ఇంటికి ఇన్వైట్ చేస్తాడు రోషన్. దీంతో ఈ ఎపిసోడ్ కామెడీగా సాగుతుంది. మూడవ ఎపిసోడ్ లో ది వెడ్డింగ్.‌. ఇందులో గేమ్ లో కొన్ని పాయింట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో గాయత్రీ, భార్గవ్ ఇద్దరు పెళ్ళి చేసుకుంటారు. అయితే ఇక్కడే వారద్దరి మధ్య కొన్ని క్లాషెస్ వస్తాయి. ఇలా ఒక్కో ఎపిసోడ్ ఒక్కోరకంగా ఆకట్టుకుంది. అయితే ప్రతీ ఎపిసోడ్‌లోను గేమ్ ఒక టైం పాస్ కి ఆడే ఆట కాదని.. ఒక ఎమోషన్ అంటూ తన చుట్టూ ఉన్నవారిని మర్చిపోయి లీనమై ఆడే ఒక గేమ్ గా గాయత్రీ, ఆనంద్, భార్గవ్ భావిస్తుంటారు. 

ఈ సిరిస్ మొదటి ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎక్కడా కూడా లాగ్ అనిపించదు. ప్రతీది గేమ్ ని కనెక్ట్ చేస్తూ, గేమ్ ఆడే ప్లేయర్ యొక్క లైఫ్ స్టైల్స్ ని చూపిస్తూ.. సిరీస్ చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠభరితంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంత గ్రిస్పింగ్ గా ఉంటుంది. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ ఈ సిరిస్ కు ప్లస్ అయింది. సిద్దార్థ సదాశివుని అందించిన బిజిఎమ్ ప్రతీ ఎపిసోడ్ ని కనెక్ట్ చేస్తూ సిరీస్ పై ఇంటెన్స్ ఉండేలా తీర్చిదిద్దాడు. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


నటీనటుల పనితీరు:

గాయత్రీగా నిహారిక కొణిదెల ఇమిడిపోయింది. భార్గవ్ గా అక్షయ్ లఘుసాని, రోషన్ గా సాయి రోనాక్, ఐశ్వర్యగా భావన సాగి వారి వారి పాత్రలకి న్యాయం చేసారు. ఆనంద్ గా వైవా హర్ష ఈ సిరీస్ కి ప్రాణం పోశాడు. ఇక మిగతా పాత్రలలో అందరూ బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

గేమ్ లవర్స్ కి ఈ వెబ్ సిరీస్ మంచి కిక్ ని అందిస్తుంది. ఈ వెబ్ సిరీస్ చివరలో ఒక మెసెజ్ ని కూడా ఇస్తుంది.

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్