English | Telugu
చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Jul 26, 2024
వెబ్ సిరీస్ : చట్నీ సాంబార్
నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, క్రిష్ హసన్, లాంగో, చంద్రమౌళి పిఎస్, నితిన్ సత్య, సంయుక్త విశ్వనాథన్, నందిని మైనా తదితరులు
ఎడిటింగ్: జిజేంజ్రన్ జీ
మ్యూజిక్: అజేశ్
సినిమాటోగ్రఫీ: ప్రసన్న ఎస్. కుమార్
నిర్మాతలు: ఇషారి కె. గణేషన్
దర్శకత్వం: రాధా మోహన్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
ఊటిలోని ఫేమస్ అయినటువంటి అముద హోటల్ లో ఈ కథ మొదలవుతుంది. ఆ హోటల్ యజమాని దానికి సంబంధించిన డిటేల్స్ అన్నీ మీడియాకొ చెప్తూ ఎమోషనల్ అవుతాడు. ఇక అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోతాడు. డాక్టర్ అతడిని చూసి ఇంకా కొన్ని రోజులే అని చెప్పడంతో అతని కొడుకు కార్తిక్ తో పాటు కుటుంబ సభ్యులంతా భాదలో ఉంటారు. ఓ రోజున కార్తిక్ ని ఒక్కడినే వాళ్ళ నాన్న రమ్మని పిలిచి ఓ నిజం చెప్తాడు. అదేంటంటే తను బ్రతుకుతెరువు కోసం చెన్నై కి వెళ్లినప్పుడు ఓ అమ్మాయితో కలిసి ఉన్నానని , ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ హోటల్ పెట్టానని గతమంతా చెప్తాడు. ఆమెకి ఓ కొడుకు ఉన్నాడంటూ , నేను చనిపోయే లోపు అతడిని తీసుకురా అంటూ కార్తిక్ తో వాళ్ళ నాన్న చెప్తాడు. దాంతో కార్తిక్ పీటర్, మరియు వాళ్ళ బావని తీసుకొని చెన్నైకి బయల్దేరి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళాక కార్తిక్ కి సచిన్ బాబు అన్నయ్య అని తెలుసుకుంటాడు. మరి సచిన్ బాబుని కార్తిక్ ఊటికి తీసుకొచ్చాడా? నాన్నకిచ్చిన మాట కోసం కార్తిక్ ఏం చేశాడు? అసలు సచిన్ బాబు గతమేంటి తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఊటీలో గ్రాంఢ్ హోటల్ నడుపుతున్న ఓ పెద్దాయన చావు బతుకుల మధ్య అడిగిన చివరి కోరికేంటి? తన కొడుకు అది నెరవేరుస్తాడా లేదా అనే క్యూరియాసిటిని కలిగించడంలో దర్శకుడు రాధా మోహన్ సక్సెస్ అయ్యాడు. ఓ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు వారి లైఫ్ లోకి కొన్ని అనుకొని సంఘటనలు వస్తే వారంతా ఎలా రియాక్ట్ అయ్యారని తెలియజేసే ఈ కథ ఫ్యామిలీతో కలిసి చూసేలా తీర్చిదిద్దారు.
ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. మొదటిది ఏ స్పైసీ రివలేషన్.. ఇందులో క్యారెక్టర్లని పరిచయం చేశాడు. ఇక రెండోది ఫ్రైయింగ్ టైమ్స్ అహెడ్.. ఇందులో సచిన్ బాబుని చెన్నై నుండి కార్తిక్ తీసుకురావడం.. వాళ్ళ నాన్న మాటలు అన్నీ ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. మూడు, నాలుగు, అయిదు ఎపిసోడ్ లలో కథ మలుపులు తిరుగుతుంటుంది. ప్రతీ ఎపిసోడ్ చివరన ఓ ట్విస్ట్ లాగా తీసుకొచ్చారు. ఒక్కో ఎపిసోడ్ లో సాగే కథనానికి ఆడియన్ ట్రావెల్ అయ్యేలా ప్రధాన పాత్రలని, వారి మధ్య మాటలని చాలా సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. బ్యాక్ డ్రాప్ డ్రామా కంటతడి పెట్టిస్తుంది.
ఎమోషనల్ సీన్లు, డైలాగ్స్, యోగి బాబు కామెడీ ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ లో యోగి బాబులోని మరో కోణాన్ని దర్శకుడు పరిచయం చేశాడు. అది చూస్తేనే తెలుస్తుంది. ఈ వీకెండ్ కి ఇంట్లో ఫ్యామిలీతో కలసి చూసే వాటిల్లో ఈ సిరీస్ ని యాడ్ చేసుకోవచ్చు. అసభ్య పదజాలం ఎక్కడ వాడలేదు. అడల్ట్ సీన్లు లేవు. పాటలు ఉన్నంతలో బాగున్నాయి. ఊటి అందాలతో పాటు పాత్రలని అందంగా మలచడంలో ప్రసన్న ఎస్.కుమార్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. జిజేంజ్రన్ జీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సచిన్ బాబు పాత్రలో యోగి బాబు సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఈ వీకెండ్ కి ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది.
రేటింగ్: 3 / 5
✍️. దాసరి మల్లేశ్