Read more!

English | Telugu

తెలుగునాట 'బిచ్చగాడు-2' జోరు.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

2016 లో 'బిచ్చగాడు'తో ఘన విజయాన్ని అందుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ.. తెలుగునాట మరోసారి సత్తా చాటుతున్నాడు. ఆయన నటిస్తూ దర్శకత్వం వచ్చిన 'బిచ్చగాడు-2' సినిమా మే 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా కూడా 'బిచ్చగాడు' తరహాలోనే తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబడుతోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి విజయ్ కి మరో విజయాన్ని అందించింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'బిచ్చగాడు-2'.. మొదటి రోజు రూ.2.32 కోట్ల షేర్ తో సత్తా చాటింది. రెండో రోజు రూ.1.62 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.88 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.0.65 కోట్ల షేర్ తో.. నాలుగు రోజుల్లో రూ.6.47 కోట్ల షేర్(రూ.11.50 కోట్ల గ్రాస్) రాబట్టి లాభాల్లోకి ఎంటరైంది. ప్రస్తుతం వేసవి సెలవలు కావడంతో పాటు, ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో.. ఫుల్ రన్ లో 'బిచ్చగాడు-2' తెలుగునాట మంచి లాభాలు పొందే అవకాశముంది.

'బిచ్చగాడు-2' తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రూ.11.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ, తమిళనాట రూ.10.23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.1.90 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.23.63 కోట్ల గ్రాస్(రూ.11.60 కోట్ల షేర్) వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'బిచ్చగాడు-2' ఓవరాల్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే, ఇంకా 4 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.