Read more!

English | Telugu

ఓటీటీలోకి జీవితానికి కొత్త అర్థం చెప్పే సినిమా..  అరువి రివ్యూ!


ఓటీటీలోకి ప్రతీవారం కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే హిట్ గా నిలుస్తాయి‌. అయితే తమిళం, మలయాళంలో రిలీజైన కొన్ని సినిమాలు తెలుగులోకి అనుసరిస్తున్నారు మేకర్స్. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం  తమిళంలో రిలీజైన మూవీ ' అరువి'. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. 

ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో కలలు కంటాడు. కానీ కొన్నిసార్లు ఊహించనిదేదో జరిగి జీవితమే తలకిందులవుతుంది. ఇదే చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అరుణ్ ప్రభు పురుషోత్తమన్. మరి అంతలా ఈ సినిమాలో ఏం ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా అరువి అనే అమ్మాయి చుట్టూ సాగే కథ. సాధారాణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అరువి.. అందరు ఆడపిల్లలలాగే ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఉంటుంది. అరువి వాళ్ళ అమ్మనాన్నలు తనని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. పెరిగి పెద్దయ్యాక అరువి కాలేజీలో అందరితో సరదాగా ఉంటు ఆటపట్టిస్తుంది. అంతా బాగా సాగుతుందనుకున్న అరువి జీవితం ఓ మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని తెలుసుకున్న తన తల్లిదండ్రులు అరువిని ఇంట్లో నుండి గెంటేస్తారు. ఇక బయట ఒక్కతే బతకలేక చాలా కష్టాలు పడుతుంది అరువి. అప్పుడే ఎమిలి అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు అకస్మాత్తుగా.. తనని ముగ్గురు వ్యక్తులు మోసం చేశారని ఓ టీవీ ఛానెల్ లో డిబేట్‌ కి వెళ్తుంది అరువి. ఇక్కడ నుండి కథ అనేక మలుపులు తిరుగుతుంది.

అసలు అరువికి ఉన్న సమస్య ఏంటి? అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఎందుకు తనని ఇంట్లో నుండి పంపించేశారు? ఆ ముగ్గురు మగాళ్ళు ఏం చేశారో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అనుకోకుండా జరిగిన ఓ తప్పిదం వల్ల అరువి జీవితం ఎలా మారిపోయిందో ఈ సినిమా తెలియజేస్తుంది. గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే తో చివరిదాకా మలుపులతో సాగుతుంది. సినిమా అనగానే ఎలవేషన్స్, ఆరు పాటలు, నాలుగు ఫైట్లే కాకుండా ఓ అమ్మాయి జీవితాన్ని కూడా తీయొచ్చని, తీసి హిట్ కొట్టొచ్చని దర్శకుడు అరుణ్ ప్రభు పురుషోత్తమన్ నిరూపించాడు‌. ఈ సినిమా మన చుట్టూ ఉండే మనుషులని దగ్గర నుండి చూపించినట్టుగా ఉంటుంది‌. అందుకే ఇది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఓసారి చూసేయ్యండి.