Read more!

English | Telugu

అమితాబ్ బచ్చన్ సరికొత్త రికార్డు.. ప్రభాస్ పిల్లాడేనా!

పదహారు గంటలు.. కేవలం పదహారంటే పదహారు గంటల్లో ఒక సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అదొక అరుదైన రికార్డు.ఎనిమిది పదుల వయసులో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(amitabh bachchan)సాధించిన ఆ రికార్డు ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.


ప్రభాస్ (prabhas) హీరోగా తెరకెక్కతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కల్కి 2898 ఏడి( kalki 2898 ad)ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మొత్తం ఈ మూవీ కోసం ఎదురుచూస్తు ఉంది. మే 9 న వరల్డ్ వైడ్ గా  రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీలో అమితాబ్ ఒక కీలక పాత్రని పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన గెటప్ ని రిలీజ్ చేస్తే అది సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ ని సాధించింది. తాజాగా అమితాబ్ పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ  ఒక వీడియో విడుదల చేసారు. నిమిషం నిడివి ఉన్నఆ 
వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో నెంబర్ వన్  ట్రెండింగ్ లో ఉంది. కేవలం 16 గంటల్లోనే 44 లక్షల వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. దీంతో  బాక్స్ ఆఫీస్ వద్ద  అమితాబ్ కి ఉన్న చరిష్మా ఏ పాటిదో అర్ధం అవుతుంది.

మహాభారతకాల  సమయంలో పాండవులకు విద్య నేర్పిన ద్రోణ చార్యుడు కుమారుడు  అశ్వత్థామ గా అమితాబ్  చేస్తున్నారు. దీన్నిబట్టి మూవీ స్థాయిని ఊహించుకోవచ్చు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు అమితాబ్ ని నువ్వు ఎవరు అని అడుగుతుంటాడు. దీంతో కొంత మంది  ఆ పిల్లాడు ప్రభాస్ అయ్యుంటాడా అని అనుకుంటున్నారు. అలాగే  ప్రభాస్ క్యారక్టర్  కి అశ్వద్ధామ కి సంబంధం ఏంటి  అనే క్యూరియాసిటీ కూడా  అందరిలో ఏర్పడింది. ఆసలు  అమితాబ్ ఇంట్రడక్షన్ క్యారక్టరే ఒక రేంజ్ లో  ఉంటే ఇక ప్రభాస్ క్యారక్టర్ ఎలా  ఉంటుందో అని కూడా  ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ క్యారక్టర్ మీద కూడా అందరిలో క్యూరియాసిటీ ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా చేస్తుండగా  వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ అత్యంత భారీ వ్యయంతో  నిర్మిస్తున్నాడు.