Read more!

English | Telugu

అల్లు అర్జున్ ని దింపేశారుగా!

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో అరుదైన ఘనతను సాధించాడు. దుబాయ్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాట్యూను పెట్టారు.

టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ స్టాట్యూను తాజాగా ఆవిష్కరించారు. ఈ వాక్స్ స్టాట్యూ పర్ఫెక్ట్ గా రావడం కోసం 200 రకాల మెజర్మెంట్స్ ని అల్లు అర్జున్ నుండి సేకరించడం జరిగిందని టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. కాగా అల్లు అర్జున్ తన వాక్స్ స్టాట్యూని చూసుకుని, నిజంగా తనని తాను అద్దంలో చూసుకుంటున్నట్టు ఉంది అని, చాలా రియలిస్టిగా చేశారని ప్రశంసించాడు.