Read more!

English | Telugu

అల్లు అర్జున్ రికార్డు రెమ్యునరేషన్ 

వెరీ షార్ట్  పీరియడ్ లో  స్టైలిస్ట్ స్టార్ గా, ఆ పై ఐకాన్ స్టార్ గా మారిన హీరో అల్లు అర్జున్ (allu arjun) ఇప్పటికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ముద్దుగా  బన్నీ అని పిలుచుకుంటారంటే ఆయన యాక్టింగ్  స్టామినా ఏ పాటిదో  అర్ధం చేసుకోవచ్చు.ఈజీ నటనకి, డాన్సులకి  కేర్ ఆఫ్ అడ్రస్స్ కూడా. ఇప్పుడు  బన్నీ రెమ్యునరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బన్నీ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2)  తో బిజీగా ఉన్నాడు.  తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ తో అందరి మైండ్ లలో తిష్ట వేసాడు. దీంతో అందరు పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని  వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి 150 కోట్లు తీసుకుంటున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అల వైకుంఠపురం, పుష్ప పార్ట్ 1 కే 100 కోట్లు తీసుకున్నాడు. అలాంటిది టూ  కి వన్ ఫిఫ్టీ అనేది నిజమే కావచ్చు. పైగా ఆ విషయంలో  ఆశ్చర్య పడాల్సిన పని కూడా లేదు. 

ఎందుకంటే  పార్ట్ 1 తో  పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాడు.అధికార లెక్కల ప్రకారం 370 కోట్లు దాకా  రాబట్టింది. అదంతా బన్నీ వల్లనే అనేది జగమెరిగిన సత్యం. సో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఇండియన్ యాక్ట్రస్ ల్లో బన్నీ గా చేరినట్టే.  పార్ట్ వన్  ని నిర్మించిన నవీన్ ఎర్నేని ,యలమంచిలి రవిశంకర్ లు  మైత్రి మూవీస్ పై పార్ట్ టూ ని కూడా  అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు కాగా రష్మిక కధానాయిక.