Read more!

English | Telugu

'దేవర'లో అల్లరి నరేష్.. క్లారిటీ వచ్చేసింది!

'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న చిత్రం 'దేవర'(Devara). కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇందులో అల్లరి నరేష్(Allari Naresh) కూడా ఓ కీలక పాత్రలో అలరించనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నరేష్ స్పందించాడు.

నరేష్ నటించిన తాజా చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు'(Aa Okkati Adakku) మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నరేష్ కి.. దేవరకి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, ఆసక్తికర సమాధానమిచ్చాడు. దేవరలో నటించే అవకాశం వచ్చిన తనకే తెలియదని నరేష్ అన్నాడు. అది రూమర్ మాత్రమేనని, ఒకవేళ నటించే అవకాశమొస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాడు. అంతేకాదు, తెలుగు హీరోలందరితో కలిసి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నరేష్ తెలిపాడు. కాగా, నరేష్ ఇప్పటికే 'మహర్షి'లో మహేష్ బాబుతో, 'నా సామి రంగ'లో నాగార్జునతో కలిసి నటించిన సంగతి తెలిసిందే.