Read more!

English | Telugu

దక్షిణ భారతదేశం హిందుత్వానికి ప్రతి రూపం అని బాలకృష్ణ చెప్తాడా!

నందమూరి బాలకృష్ణ (balakrishna) ఈ పేరు వింటే చాలు అభిమానులు పులకరించిపోతారు. తెర మీద తప్ప నిజ జీవితంలో యాక్టింగ్ కి చాలా దూరంగా ఉంటాడు. ఆ వ్యక్తిత్వమే  కొన్ని లక్షల మందిని అభిమానులుగా చేసింది. తెలుగు సినీ సీమలో డైలాగ్ చెప్పాలంటే  బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అనే కీర్తిని కూడా సంపాదించాడు. ఆ మాట  నిజం అని  చాలా మంది హీరోలు ఆన్ ది రికార్డు గానే చెప్పారు. ఇప్పుడు బాలయ్య నోటి వెంట  దక్షిణ భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు. హిందుత్వానికి ప్రతి రూపం. ఇదీ ఎవరు కాదనలేరనే మాటలు రాబోతున్నాయని తెలుస్తుంది.

బాలకృష్ణ అప్ కమింగ్ మూవీస్ లో అఖండ 2 (akhanda 2) ఒకటి. బోయపాటి శ్రీను దర్శకుడు. అఖండ  సూపర్ డూపర్ హిట్ కావడంతో 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఇదే అంటు సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అఖండ 2  కథ మొత్తం  పూర్తిగా శైవత్వం పై సాగబోతుంది.  హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అని  చెప్పబోతున్నారు. ఆ యాంగిల్ లోనే  సీన్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే ఎంటైర్  హిందూ దేవాలయాలకు సంబంధించిన  లింక్స్ ని కూడా బయటపెట్టబోతున్నారు. టోటల్ గా  దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని ఎలివేట్ చెయ్యబోతున్నారు. ఈ న్యూస్ అయితే  బాలయ్య ఫ్యాన్స్ లో  పూనకాలు తెప్పిస్తుంది.

మొదటి పార్ట్ లో శివతత్వాన్ని నింపుకున్న అఘోరా గా బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఒక రెండు నిమిషాలు పాటు హిందూ ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాంటిది ఇప్పుడు 2 లో మూవీ  మొత్తం హిందూ ధర్మం  గురించి చెప్పబోతుండటంతో  అందరిలో ఎనలేని ఆసక్తి ఉంది. అక్టోబర్ నుంచి మూవీ స్టార్ట్ కాబోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి.నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సంజయ్ దత్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అయితే పక్కా అంటున్నారు. ప్రొడ్యూసర్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ రానుంది