Read more!

English | Telugu

భర్తకి హార్ట్ ఎటాక్.. వైరల్ గా మారిన నటి సనా పోస్ట్!

సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే వారికి కష్టాలుంటాయి. కొందరు మంచి చెప్పినా చెడు జరుగుతుంది. కొన్ని నెలల క్రితం తన అపార్ట్‌మెంట్ లో ఓ వ్యక్తి చనిపోయాడని అతనికి సంతాపం తెలియజేస్తూ సనా ఓ వ్లాగ్ చేయగా అది నెట్టింట వైరల్ గా మారింది. ఇక  ఆ తర్వాత నెమ్మదిగా వ్లాగ్స్ తగ్గించేసిన సనా.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.

"అందరికీ హాయ్.. లేటుగా వ్లాగ్స్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేనందుకు క్షమించండి. నా భర్తకు రీసెంట్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. లాస్ట్ మినిట్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం‌. ఆపరేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. నన్ను ఆదరించే అభిమానులకి, శ్రేయోభిలాషులకి ఇదే నా విన్నపం.. మీ ఆశీస్సులని మా వారికి అందించండి" అంటూ సనా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్  ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. 

షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి  సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది. సనా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సన. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా. 

తాజాగా తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా. ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తన యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా.. కెరీర్ లో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా. యూట్యూబ్ లో సనా చేసే వ్లాగ్స్ వీక్షకాధరణ అధికంగా లభిస్తోంది.