English | Telugu

వరలక్ష్మికి డ్రగ్స్ కేసులో నోటీసులు.. మొన్ననే ముంబైలో ఎంగేజ్ మెంట్

వరలక్ష్మికి డ్రగ్స్ కేసులో నోటీసులు.. మొన్ననే ముంబైలో ఎంగేజ్ మెంట్

వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది.ఎలాంటి క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించడం ఆమె స్పెషాలిటీ. చాలా తక్కువ వ్యవధిలోనే  విలక్షణ నటి అనే పేరుని కూడా తెచ్చుకుంది. కొత్త  సినిమా విడుదలైతే చాలు  అందులో వరలక్ష్మి ఉందా అని ప్రేక్షకులు ఎంక్వయిరీ చేస్తున్నారంటే  ఆమె రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. చాలా మంది దర్శకులు ఆమె  తమ సినిమాలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు.మరి ఇంతటి ఘనతని సాధించిన వరలక్ష్మి గురించి వస్తున్న  లేటెస్ట్  న్యూస్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.

వరలక్ష్మి కి ఇటీవలే  ముంబై కి చెందిన  నికోలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ అయింది. త్వరలోనే ఆ ఇద్దరి వివాహం  జరగనుంది.  తాజాగా డ్రగ్ స్మగ్లింగ్ కేసులో  ఎన్ఐఏ  వరలక్ష్మి కి  నోటీసులు పంపించింది. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. రాజలింగం అనే డ్రగ్ డీలర్ ని పోలీసులు ఇటీవలే  అరెస్ట్ చేసారు. ఇతను వరలక్ష్మి దగ్గర గతంలో అసిస్టెంట్ గా పని చేసాడు. పట్టుబడిన సమయంలో అతని వద్ద నుంచి  300 కేజీల హెరాయిన్, ఏ కే 47  రైఫిల్, 9 ఎం ఎం తుపాకుల తో పాటు 2100 కోట్ల విలువైన మందు గుండు సామాగ్రిని కూడా  స్వాధీనం చేసుకున్నారు.పలు అంతర్జాతీయ నేరగాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించారు

 విచారణలో డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టినట్టుగా అతను  చెప్పాడు. ఈ క్రమంలోనే వరలక్ష్మిని విచారించనున్నారు. విచారణకి హాజరవ్వడానికి వరలక్ష్మి కొంత సమయం కావాలని అడిగింది.మరి ఆమె కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో  చూడాలి. ఆమె నటించిన చివరి చిత్రం హనుమాన్. కాగా   ఆమె తండ్రి శరత్ కుమార్ హఠాత్తుగా తన పొలిటికల్ పార్టీ ని బిజెపి లో విలీనం చెయ్యడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.