English | Telugu

సుడిగాలి సుధీర్ ss4 ఓపెనింగ్ సెరిమనీ

సుడిగాలి సుధీర్ ss4 ఓపెనింగ్ సెరిమనీ

సుడిగాలి సుధీర్ తన నెక్స్ట్ మూవీ #ss4 ఓపెనింగ్ సెరిమనీ రీసెంట్ గా జరిగింది. ఇందులో హీరో సుధీర్, హీరోయిన్ దివ్యభారతి, డైరెక్టర్ నరేష్ కుప్పిలితో పాటు మూవీ టీం అంతా పాల్గొంది. దానికి సంబంధించిన పిక్స్ ని హీరో హీరోయిన్స్ ఇద్దరూ తమతమ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు. "ఈ సినిమాలో ఒక భాగం కావడం ఆనందంగా ఉంది..ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలని కోరుకుంటున్నా" అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టుకుంది దివ్య భారతి.  నరేష్ కుప్పిలి లాస్ట్ ఇయర్ విశ్వక్సేన్ తో "పాగల్" అనే  మూవీ తీశారు. ఇకపోతే మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సుధీర్ నటించి రిలీజ్ కి రెడీ ఐన మూవీ "కాలింగ్ సహస్ర" నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట.  

ఇదొక హారర్, థ్రిల్లర్ మూవీ. సుధీర్ నటించిన "గాలోడు" మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యి డబ్బులు రావడంతో సుధీర్ తో మరిన్ని మంచి మూవీస్ తియ్యడానికి డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. సుధీర్ కి ఈ ఇయర్ బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. బుల్లితెరపై కమెడియన్‌గా, హోస్ట్‌గా, యాంకర్‌గా మెప్పించాడు సుధీర్. బుల్లితెర మీద తనకు ఎంత క్రేజ్ ఉందో అంతకంటే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ మీద స్టార్డం తెచ్చుకోవాలని కష్టపడుతున్నాడు సుధీర్. ఆ ప్రాసెస్ లోనే బుల్లితెరకు కంప్లీట్ బ్రేక్ ఇచ్చేసాడు.