English | Telugu
రవితేజకు షాకిచ్చిన బాలీవుడ్
Updated : Oct 24, 2023
మాస్ మహారాజా రవితేజకు మాస్‌లో మంచి ఇమేజ్ ఉంటుంది. అందుకనే ఆయన ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతోన్న తరుణంలో రవితేజ సైతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ వర్గాల్లోనూ మూవీని ప్రమోట్ చేసుకున్నారు. అనుపమ్ ఖేర్ సపోర్ట్‌తో బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లిన రవితేజకు సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఊహించని షాక్ తగిలిందని అందరూ అంటున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా హిందీ వెర్షన్‌కు అస్సలు ప్రేక్షకాదరణ దక్కలేదు. కనీస ఖర్చులు కూడా హిందీ బెల్ట్‌లో సినిమాకు రాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. టైగర్ సినిమాపై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్‌ను కూడా పెట్టుకున్నారు. అయితే కూడా ఇది బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మరిప్పుడు రవితేజ ఏం చేస్తాడనేది అంటే పాన్ ఇండియా మార్కెట్‌పై మళ్లీ ఫోకస్ చేస్తాడా లేదా తెలుగు సినిమా మార్కెట్‌పైనే ఫోకస్‌గా వెళతాడా? అనేది చూడాల్సి ఉంది.
ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈగల్ సినిమాను చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
