English | Telugu

`భీమ్లా నాయ‌క్` నుంచి మ‌రో స్పెష‌ల్ వీడియో!

`భీమ్లా నాయ‌క్` నుంచి మ‌రో స్పెష‌ల్ వీడియో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్`. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`  ఆధారంగా రూపొందుతున్న ఈ మ‌ల్టిస్టార‌ర్ లో రానా దగ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించనున్నాడు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సంభాష‌ణ‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ పాత్ర‌కు సంబంధించిన ప్ర‌చార చిత్రాలపైనే ఫోక‌స్ పెట్టిన యూనిట్.. త్వ‌ర‌లో రానా క్యారెక్ట‌ర్ కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కి శ్రీ‌కారం చుడుతోంద‌ట‌. అందులో భాగంగానే.. ఈ వారంలో రానా పోషిస్తున్న డేనియ‌ల్ శేఖ‌ర్ పాత్ర తాలుకూ ఫ‌స్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 17న ఈ స్పెష‌ల్ వీడియో విడుద‌ల కాబోతోంద‌ని తెలిసింది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

కాగా `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌న్ కి జంట‌గా నిత్యా మీన‌న్ న‌టిస్తుండ‌గా.. రానాకి జోడీగా ఐశ్వ‌ర్యా రాజేశ్ క‌నిపించ‌నుంది. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 12న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.