Read more!

English | Telugu

అదిరిపోయిన 'అమిగోస్' ట్రైలర్!

'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా 'అమిగోస్'. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం పోషిస్తుండటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'అమిగోస్' ట్రైలర్ టైటిల్ కి తగ్గట్లే విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంది. ఎలాంటి బంధం లేకపోయినా ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తులు కలిస్తే? అందులో ఒక వ్యక్తి పెద్ద క్రిమినల్ అయితే? వంటి ఆసక్తికరమైన అంశాలతో సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది ట్రైలర్. కామెడీ, రొమాన్స్, యాక్షన్ కలయికతో రూపొందిన ఈ మూవీ కళ్యాణ్ రామ్ కి మరో విజయాన్ని అందిస్తుందనే అభిప్రాయాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. "నేను ఎవరినీ బెదిరించను.. జస్ట్ చంపేస్తాను" అంటూ ఎన్ఐఏ వెతుకుతున్న బిపిన్ అనే క్రిమినల్ గా నెగటివ్ పాత్రలో కళ్యాణ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.