English | Telugu
బాలయ్య ఏం చేస్తున్నాడు!..నందమూరి అభిమానులు ఏం చేస్తున్నారు!
Updated : Mar 12, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)ఊరమాస్ డైరెక్టర్ 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)కాంబోలో సింహ,లెజండ్,అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమాలు సృష్టించిన రికార్డుల రీసౌండ్ ఇప్పటికి అభిమానుల్లో,ప్రేక్షకుల్లో వినిపిస్తునే ఉంది.దీంతో ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ'అఖండ 2'(Akhanda 2)పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
అఖండ-2 షూటింగ్ హిమాలయాల్లో జరపడానికి యూనిట్ లొకేషన్ల వేటలో ఉందనే వార్తలువచ్చిన విషయం తెలిసిందే.అఘోర గా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు,పలు కీలక సన్నివేశాలని హిమాలయాల్లోనే చిత్రీకరిస్తారని,ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు హిమాలయాల్లో ఎవరు చూపించని సరికొత్త లొకేషన్లలో షూట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.దీంతో అఖండ 2 అప్ డేట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తు వస్తున్నారు.షూట్ కి సంబంధించి పిక్ ఏమైనా బయటకొస్తుందేమోనని,అందులో తమ బాలయ్య గెటప్ కనిపిస్తుందేమో అని,ప్రతి రోజు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు.కానీ మేకర్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు.దీంతో అఖండ 2 అప్ డేట్ ఇవ్వాలని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తో కలిసి 14 రీల్స్(14 reels)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లు కాగా,సంజయ్ దత్,ఆది పినిశెట్టి లాంటి లెజండ్రీ నటులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.థమన్(Thaman)మరోసారి తన సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకుల చేత శివ తాండవం చేయించనున్నాడని యూనిట్ ఇప్పటికే వెల్లడి కూడా చేసింది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
