Read more!

English | Telugu

సినిమా పేరు:యంగ్ ఇండియా
బ్యానర్:సిరి మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:May 15, 2010
అభి (న్యూ) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఏదైనా చాలా రిచ్ గా వుండాలని కోరుకునే వ్యక్తి. ఐతే సాఫ్ట్ వేర్ బూం ఒక్కసారిగా పడిపోయే సరికి అతని జాబ్ పోతుంది. దాంతో అతని పైనే ఆధార పడ్డ తన చెల్లెలిని పోగొట్టుకుంటాడు. తన ప్రియురాలిని కూడా దూరం చేసుకుంటాడు. ఒక్కసారిగా అతనికి తన జీవితం అంధకారం అయిపోతుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఓ ఎమ్మెల్యే, ఎం.పి. కొడుకులని హత్య చేసిన అభి ఫ్రెండ్స్ రాయ్ (కొత్త అమ్మాయి), రజాక్ (న్యూ), వెంకీ (న్యూ) ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ నలుగురిని కీర్తి (సౌమ్య) కాపాడుతుంది. కీర్తి ఎస్.పి. రంగయ్య నాయుడు (దాసరి నారాయణ రావు) కూతురు. ఎస్.పి. ఆ నలుగురిని చేరదీసి ధైర్యం చెబుతాడు. దేశం కోసం చనిపోతే చరిత్రలో నిలిచిపోతారు అని హితబోధ చేస్తాడు. ఎస్.పి. ని ఆదర్శంగా తీసుకున్న ఆ నలుగురు ఏకమై యంగ్ ఇండియా అనే సంస్థని స్థాపిస్తారు. కొన్ని కార్పోరేట్ హాస్పిటల్స్ పేద ప్రజలకి చేరువ కావాల్సిన ఆరోగ్యశ్రీ పధకాన్ని ఆ పేద ప్రజల అమాయ కత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లు గడించడం, సాక్షాత్తు హోం మినిస్టరే తమ జవాన్లకి అందజేసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల అవినీతికి పాల్పడడం తో వీరి భండారం బయట పెట్టడానికి ఎస్.పి. రంగయ్య నాయుడు ప్రోద్భలంతో యంగ్ ఇండియా గ్రూప్ నడుం బిగిస్తుంది. ఆ క్రమంలో వారు ఎన్ని కష్ట నష్టాలని ఎదుర్కొన్నారు, చివరికి వారు విజయం సాధించారా లేదా అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
డాక్టర్ దాసరి నారాయణరావు తన 149 వ చిత్రంగా 81 మంది కొత్తవారిని పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం నేటి యూత్ కి సందేశం అందించే చిత్రంగా నిలుస్తుంది. కొత్తవారితో చిత్రాన్ని నిర్మిస్తానని దాసరి ప్రకటించడం ఆలస్యం, ఇరవై రెండు వేల అప్లికేషన్లు రావడం, అందులోనుండి 81 మంది ఆర్టిస్ట్ లని ఎంపిక చేసుకుని నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రంలో నేటి యువత కి స్ఫూర్తిని కలిగించే అంశాలతో పాటు, రాజకీయం ముసుగులో యధేచ్చగా సాగుతున్న అక్రమాల్ని, మీడియా రంగం లో రాజకీయ నాయకులు ప్రవేశించి ఆ రంగాన్ని తమకి అనుకూలంగా ఎలా మార్చు కుంటున్నారన్న విషయాలన్నింటినీ స్పృశించారు. లీడింగ్ పాత్రలు పోషించిన వారు కొత్తవారే అయినప్పటికీ ఆ ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలగకుండా దాసరి చాలా చక్కగా డీల్ చేసారు. అటు యువతకి సందేశాన్ని అందించడం, ఇటు రాజకీయం లో జరుగుతున్న అక్రమాల్ని ఎండగట్టడం, ఈ రెండింటినీ సమానంగా తెరకెక్కించడంలో దాసరి సక్సెస్ సాధించారు. ఇక ఎస్.పి. రంగయ్య నాయుడుగా నటించిన దాసరి తన గత చిత్రాల్లో మాదిరిగా పేజీలకు పేజీలు డైలాగులు చెప్పి ప్రేక్షకులని విసుగు తెప్పించే విధంగా కాకుండా చాలా సింపుల్ గా నేటి ట్రెండ్ ని దృష్టిలో ఉంచుకుని తన క్యారెక్టర్ ని మలుచుకునే విధానం బావుంది. ఇక ఈ చిత్రం లో తనదైన శైలిలో 'చిట్టివలస చిట్టి' పాత్రలో బ్రహ్మానందం పాత్ర హాస్యాన్ని పండిస్తుంది. ముఖ్యంగా స్మోక్ టి.వి. చీఫ్ ఎడిటర్ గా తన టి.వి. రేటింగ్ పెంచుకోవడానికి బ్రహ్మానందం చేసే జిమ్మిక్కులు, వాటికి అడ్డుతగులుతూ బ్రహ్మానందానికి చెక్ పెట్టే దాసరి.. ఈ సన్నివేశాలని చూస్తున్నంత సేపు కామేడిగానే అనిపించినా నిజంగా న్యూస్ మీడియా ఇంత దిగజారుడు తనానికి పడిపోయిందేమో అన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఓవరాల్ గా దాసరి గత చిత్రాలతో పోలిస్తే.. ఈ చిత్రం కాస్త డిఫరెంటుగా తెరకెక్కి న్దనడంలో ఎలాంటి సందేశం లేదు
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కొత్త నటీ నటులందరి పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. ఇక దాసరి గారి పాత్ర తమిళ తంబిలు మాట్లాడే తెలుగు యాసతో చాలా బాగా నటించారు. చిట్టివలస చిట్టి గా బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి మరో హైలెట్. మిగతా నటీ నటులందరూ తమ పాత్రకి తగ్గట్టుగా బాగానే చేసారు.ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం బావుంది. సినిమాలో వున్న పాటలు కథలో లీనమయి పోయేవిధంగానే సాగిపోతాయి తప్ప, ప్రేక్షకులకు విసుగు తెప్పించవు. ముఖ్యంగా 'మిరపకాయ బజ్జి' పాట యూత్ ని ఆకట్టుకుంటుంది.డాక్టర్ దాసరి నారాయణ రావు అందించిన మాటలు ఈ చిత్రానికి మరో హైలైట్. "జీవితమంటే సంపాదన కాదు, సంపాదన అంటే పరువు కాదు", "ఇది ఐశ్వర్య రాయ్ కాదురా పెద్ద గులక రాయి", "వాతావరణం కూడా నాలాగే విషాదంగా, విచిత్రంగా వుంది" లాంటి మాటలు ఆకట్టుకుంటాయి.సాఫ్ట్ వేర్ బూం పడిపోవడం తో విలాస బ్రతుకులకు అలవాటు పడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఒక్క సారిగా తమ ఉద్యోగాలు పోవడం, చేతిలో డబ్బులు లేక పోవడం, ఇన్ స్టాల్ మెంట్లలో తీసుకున్న కారు, ఫ్లాట్లు కనుమరుగయి పోవడంతో విరక్తి తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ ఐ.టి. ఉద్యోగి, కేవలం ఒకరు అందించిన ప్రోద్భలంతో రాష్ట్రానికి పేరు తెచిపెట్టడమే కాకుండా జీవితం విలువ గురించి తెలుసుకున్న కథ ఇది. నేటి యూత్ కి సప్పోర్ట్ గా పెద్దవారు నిలిస్తే వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అని తెలియ చెప్పే చిత్రం ఇది.