Read more!

English | Telugu

సినిమా పేరు:నేను దేవుడ్ని
బ్యానర్:వాసన్స్ విజువల్ వెంచర్స్
Rating:---
విడుదలయిన తేది:Feb 6, 2009
ఒకతను తన కుమారుడు రుద్ర, తాను కలిసుంటే అరిష్టాలు వస్తాయని జ్యోతిష్కులు చెప్పిన మాటను నమ్మి, తన కొడుకు 10 యేళ్ళ చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు కాశీలో వదిలివెళ్తాడు. మళ్ళీ 14 యేళ్ళ తర్వాత అతన్ని చూట్టానికి తన కూతురి సాయంతో అక్కడికి వస్తాడు. తీరా అక్కడ తన కొడుకుని కనుక్కునే సరికి రుద్ర (ఆర్య) "అ ఘోరీ'గా మారిపోతాడు.చివరికి అతని గురువు అనుమతితో అతన్ని తనతో ఇంటికి తీసు కెళతాడు అతని తండ్రి. కానీ అతను ఆ వాతావరణంలో ఇమడలేక అక్కడ ఉండే గుడి వద్ద పాడుపడిన భవనంలో సాధువులుండే చోట తన సాధన తను చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఆ గుడికి వచ్చే పోయే వారి వద్ద ముష్టి అడుక్కునే నిమిత్తం కొందరు ముష్టి వాళ్ళను అక్కడ ఉంచుతాడు తాండవ అనే మనిషి. అంటే ముషివాళ్ళ మీద వ్యాపారం చేస్తుంటాడు. ఆ తాండవ. కేరళ నుండి అలాంటి వ్యాపారే మరొకడొచ్చి తాండవ దగ్గర ఉండే ముష్టి వాళ్ళను కొనుక్కుంటాడు. ఆ వ్యక్తే భయంకరంగా ముఖం అంతా కాలిపోయిన ఒకడికి శారీరక సుఖం ఇచ్చేందుకు, ఒక గుడ్డి అమ్మాయిని అప్పగించేందుకు పది లక్షలకు ఒప్పందం జరుగుతుంది. ఆ గుడ్డి అమ్మాయి రుద్రని శరణు వేడగా, అతనా అమ్మాయిని వాడిని చంపి కాపాడతాడు. ఆ విషయం మీద పోలీసులు కేసు పెట్టి, దాన్ని నిరూపించలేక పోతారు. దాంతో రుద్ర మీద పగబట్టిన తాండవ ఎటాక్‌ చేస్తాడు. తాండవని చంపిన రుద్ర కాశీలో ఉన్న తన గురువు వద్దకు వెళతాడు. ఇది క్లుప్తంగా ఈ చిత్ర ముష్టి కథ
ఎనాలసిస్ :
ఈ చిత్రానికి పెట్టిన ట్యాగ్ లైన్ “అహం బ్రహ్మస్మీ’’ అంటే నేనే బ్రహ్మను అని అర్థం. అలాగని ఇది పూర్తిగా వేదాంతానికి సంబంధించిన చిత్రమా అంటే అదీ కాదు. నేనేం తీసినా జనం చూస్తారన్న దర్శకుడి అహంకారం ఈ చిత్రం ప్రతి సీన్లో కనిపిస్తుంది. లేకపోతె ప్రతి శీను అంతగా సాగాదీయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. అసలు ఈ కథను జనం ఎలా ఆదరిస్తారని దర్శకుడు నమ్మాడో అది మరీ అర్థం కాని బ్రహ్మపదార్థం. అఘోరీల గురించి చెప్పాలనుకుంటే దాన్ని పూర్తిగా చెప్పలేకపోయాడు. అఘోరీలు ఒక పుర్రెలో తమకు ఆయాచితంగా లభించిన ఆహారాన్ని, లేకపోతే శవాలను తింటారు ... దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. నిజమైన అఘోరీలు బట్టలు కట్టారు. ఎందుకంటే తమని తాము కాలభైరవులుగా, శివస్వరూపులుగా వారు భావిస్తారు. గనుక వారు దిగంబరంగానే ఉంటారు. ప్రపంచానికి వారికీ అసలు సంబంధం ఉండదు. ఈ విషయాలను ఒక పాత్రతో చెప్పించటానికి ప్రయత్నిచాడు దర్శకుడు. అయినా వారి గురించి పూర్తిగా చూపించటంలో దర్శకుడు విఫలమయ్యాడు. తన కొడుకు గురించి పడే బాధని చూపించాడు. కానీ అది ఎంత మాత్రమూ సినిమాకి ఉపయోగపడలేదు. సినిమా మధ్యలో నుండి ముష్టివాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలూ, వాళ్ళ చేత ముష్టి వ్యాపారం చేసే వారి గురించీ ప్రేక్షకులకు ఎందుకండీ ...? వాళ్ళు మనుషులే కాదనను కానీ వాళ్ళ గురించే తీయాలనుకుంటే ఒక చక్కని డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి వాళ్ళ బాధల గురించి, వాళ్ళ కష్టనష్టాల గురించీ తెలియజేయి. అంతేకానీ కథకు సంబంధం లేకుండా, ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉండే చలన చిత్రంలో అనవస్సరమైన పాత్రలన్నింటినీ జొప్పించి, జనం సహనం పరీక్షించటం దారుణం. ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యాహంకారం. దర్శకత్వం టేకింగ్ పరంగా బాగుంది. తెక్సికల్ గా చాలా మంచి స్థాయిలోనే ఈ చిత్రం ఉంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బాడుంది. ఇలా అన్ని డిపార్ట్ మెంటులూ బాగా పనిచేశాయి. “ఓం శివోహం’’ పాట, “వరాలిచ్చే దైవం’’ పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్ గా ఉంది. ఈ చిత్రంలో మాటలు అక్కడక్కడా బాగున్నాయి. ఉదాహరణకు “కళ్ళు రెండు .... కాళ్ళు రెండు ... కరములు రెండు ... ఉన్నా దేహమును దేహిగా మారుస్తావా’’, “అంబానీ ఎవడ్రా ...?’’ అంటే “అదేరా సెల్ ఫోన్లమ్ముకుంటాడే అతను’’ వంటి మాటలు ఆకట్టుకుంటాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదు. ఏదైనా ఒక డిఫరెంట్ చిత్రం అది ఎంత చెత్తఅయినా సరే చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి.