Read more!

English | Telugu

సినిమా పేరు:బ్లేడ్ బాబ్జి
బ్యానర్:సత్యా మూవీస్
Rating:2.75
విడుదలయిన తేది:Oct 24, 2008
కథగా ఈ చిత్రంలో చెప్పుకోటానికి పెద్దగా ఏం లేదు. జేబులు కొట్టే "బ్లేడ్‌బాబ్జి" (నరేష్‌) తాము నివసించే స్లమ్‌ ఏరియాలో ఉండే వారిని ఒక బిల్డర్‌ బారి నుంచి కాపాడటం కోసం, నాలుగు కోట్లు సంపాదించాలనుకుంటాడు. అతని గ్యాంగ్‌తో కలసి వైజాగ్‌ వెళ్ళి, ఆ ఎమౌంట్‌ని, ఒక బ్యాంక్‌ నుండి దొంగతనం చేస్తాడు. ఆ సొమ్ముని అప్పుడే కడుతున్న ఒక ఇంట్లో భూమిలో పాతిపెడతారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వారు ఒక నెల రోజుల పాటు వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. తీరా వీళ్ళు తాము దొంగిలించిన సొమ్ము తీసుకుందామని అక్కడికి వచ్చేసరికి అక్కడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వుంటుంది. ఆ కంట్రోలర్‌ రూమ్‌ అడుగున తాము పాతిన సొమ్ము తీసుకోటానికి, కొత్తగా పోలీస్‌లో జాయిన్‌ అయిన కృష్ణ మనోహర్‌ అనే అతన్ని కిడ్నాప్‌ చేసి, ఆ స్థానంలో బ్లేడ్‌ బాబ్జి, కృష్న మనోహర్‌గా ఆ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి వెళతాడు. ఆ తర్వాత ఆ సొమ్ము సంపాదించటానికి బ్లేడ్‌ బాబ్జి, అతని గ్యాంగ్‌ ఎన్ని పాట్లు పడతారనేది. సరదా సరదాగా సాగే మిలిగిన కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రానికి దాదాపు పదేళ్ళ క్రితం వచ్చిన "బ్లూ స్ట్రీక్‌" అనే అంగ్ల చిత్రం పూర్తిగా కనిపిస్తుంది. స్ఫూర్తే కాదు అందులో కొన్ని సీన్లు కూడా యధాతథంగా ఈ చిత్రంలో తీశారు కూడా. అయినా ఆ చిత్రాన్ని మన నేటివిటీకి మలచిన తీరు బాగుంది. దేవీప్రసాద్‌ దర్శకత్వంలో ఈ చిత్రానికి హైలైట్‌. నరేష్‌ అండ్‌ గ్యాంగ్‌ చేసే కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ మనల్ని హాయిగా నవ్వించేలా దర్శకుడు చక్కని జాగ్రత్తలు తీసుకున్నాడు. స్ర్కీన్‌ మీద కనపబడుతుంది. నిర్మాణపు విలువలు కూడా ఫరవాలేదు. ఈ చిత్రంలో చేసిన పోకిరి, తమ్మడు చిత్రాల పేరడి ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తుంది. నటన:- నరేష్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బ్లేడ్‌ బాబ్జిగా నరేష్‌ చూడముచ్చటైన నటన ప్రదర్శించాడు. ఒకపడు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ స్థానాన్ని నరేష్‌ భర్తీ చేస్తాడని వ్రాసిన చేతులే, అతను భవిష్యత్తులో ఇంకా మంచి నటుడయ్యే అవకాశాలున్నాయని వ్రాస్తాయి. అతనిలో ఆ స్థాయి వుంది. నటనలో, డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో అతని ఈజ్‌ అతనికి ప్లస్‌ పాయింటవుతుంది. కానీ అందుకు అతని వాచకం ఇంకా కొంచెం ఇంప్రూవ్‌ చేసుకోవాల్సి వుంది. హీరోయిన్‌ సయ్యాలీ భగత్‌ నటన బాగుంది. ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మానందం, వేణు మాధవ్‌, మేల్కోటే, శ్రీనివాస రెడ్డి కృష్ణభగవాన్‌ తదితరులు తమతమ పాత్రలకు తగ్గట్టు నటించి, ఈ చిత్ర విజయానికి దోహదపడ్డారనటంలో సందేహం లేదు. సంగీతం:- కోటి సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్సయ్యింది. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది. ఈ చిత్ర విజయానికి సంగీతం కూడా ఒక కారణం... సినిమాటోగ్రఫీ:- ఈ చిత్రంలో ఫొటోగ్రఫీ సగటు స్థాయిలోనే వుంది. మాటులు :- కామెడీ చిత్రానికి మాటల్లో పంచ్ డైలాగులు చాలా అవసరం, పలు హాస్య చిత్రాలకు మాటలు వ్రాసిన మెలితిరిగిన చేయి, వేగేశ్న సతీష్‌ ఈ చిత్రానికి మాటలు వ్రాశారు. ఈ చిత్రంలోని మాటలు మనల్ని నవ్విస్తాయి. బాగున్నాయి. ఈ చిత్రానికి మాటలు హైలైట్‌. పాటలు:- పాటల్లో సాహిత్యం ఫరవాలేదు. కొరియోగ్రఫీ:- కొన్ని పాటల్లో బాగుంది. ఎడిటింగ్‌:- ఎడిటింగ్‌ బాగుంది, చక్కగా క్రిస్స్‌గా కట్‌చేశారు.. ఆర్ట్‌:- ఒ.కె.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు కాసేపు రిలాక్స్‌ అవ్వాలనుకుంటే ఈ సినిమా చూస్తే చాలు. కాసేపు నవ్వుకుని కచ్చితంగా రీచార్జ్‌ అవుతారు. ఇది ఈ విలేఖరి స్వానుభవం.