English | Telugu
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అన్యాయం చేసింది వీళ్ళేనా!
Updated : May 5, 2025
గేయ రచయితకీ ఒక హోదాని,స్టార్ డమ్ ని తీసుకొచ్చిన వాళ్ళల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennla Sitaramasastri)కూడా ఒకరు. ఆయన పదాల పూదోటలో ప్రవహించని ప్రేక్షకుడు లేడు. ఆయన రాసిన పదాల ద్వారానే తెలుగు భాష ఎంత గొప్పదో తెలియడంతో పాటు, ఎంతో మంది రచయితలు, దర్శకులు తెలుగు భాషపై మరింత పట్టు కూడా సాధించారు. ప్రముఖ దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్(Triviram Srinivas)కూడా ఆ కోవలోని వ్యక్తే.
ప్రముఖ ఛానల్ ఈటీవీలో సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తు 'నా ఉఛ్వాసం కవనం(Naa Uchvasam Kavanam)అనే ప్రోగ్రాం జరుగుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ కి త్రివిక్రమ్ హాజరవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు సీతారామశాస్త్రి గారు ప్రతి పాటని చాలా లాజికల్ గా ఆలోచించి రాస్తారు. ఒక్కోసారి ఆయనకి సన్నివేశం వినిపించాలంటే సిగ్గేసేది. కానీ ఆయన బాధపడుతునే విని, ప్రేక్షకులకి అన్ని తెలుసు వాళ్ళని ఒప్పించాలనే పట్టుదలతో రాసేవారు. 'జల్సా 'మూవీలోని 'చలోరే చలోరే' పాటకి 30 వెర్షన్స్ పైగా రాసారు. కానీ అందులో కేవలం రెండు వెర్షన్స్ మాత్రమే తీసుకున్నాం. ఆయన రాసిన పదాలకి చిత్రీకరణ చెయ్యడం కుదరదు. అందుకే నాతో సహా చాలా మంది దర్శకులు ఆయన రాసిన పాటలకి న్యాయం చేయలేకపోయారని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
'సిరివెన్నెల' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యి అదే పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు సీతారామశాస్త్రి. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తన సినీ ప్రస్థానంలో మూడు వేలకి పైగా పాటలు రాయగా, కేంద్రప్రభుత్వం నుంచి నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ని సైతం అందుకున్నారు. నవంబర్ 30 2021 న చనిపోవడం జరిగింది.
