English | Telugu
షారుక్ ఖాన్ ఎక్కడకి పారిపోకుండా మొట్టమొదటి ఇండియన్ గా నిలిచాడు
Updated : May 6, 2025
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah Rukh Khan)ఇటీవల న్యూయార్క్(New York)లోని మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో జరిగిన 'మెట్ గాలా'(Metgala)లో సందడి చేసాడు. కే లెటర్ లాకెట్ ఉన్న భిన్నమైన డ్రస్ లో తన స్టైల్ ఆఫ్ ఐకానిక్ ఫోజులో నా పేరు షారుక్ అంటు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక 'మెట్ గాలా' లో పాల్గొన్న తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు.
ఈ సందర్భంగా ఒక ఆంగ్ల మీడియాతో షారుక్ మాట్లాడుతు నాకు ఫ్యాషన్ పై ఆసక్తి తక్కువ. దాంతో మెట్ గాలా కి ఆహ్వానం అందుకున్నప్పుడు చాలా ఆశ్చర్య పోయాను. ఎందుకంటే నేనెప్పుడు రెడ్ కార్పెట్ అనుభవాన్ని పొందలేదు.దాంతో షోలో చాలా భయంతో పాల్గొన్నాను. నా జీవితంలో ఎప్పుడు అంతలా భయపడలేదు. ఎప్పడెప్పుడు అక్కడి నుంచి పారిపోవాలా అనుకున్నాను. ఈ వేడుకకి నేను రావడానికి ప్రధాన కారణం నా పిల్లలు ఆర్యన్, సుహానా. నాకు ఆహ్వానం అందగానే వాళ్లిదరు ఎంతగానో సంతోషించారు. ఇందులో నేను పాల్గొనడం చరిత్రలో నిలిచిపోతుందని నాకు తెలియదు. నా కోసం సబ్యసాచి అద్భుతమైన కాస్ట్యూమ్స్ తయారు చేసారని షారుఖ్ చెప్పుకొచ్చాడు.
మెట్ గాలా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక,ఆకర్షణీయమైన ఫ్యాషన్ ఈవెంట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో హాజరైన వారికి ఫ్యాషన్ ద్వారా తమను తాము వ్యక్తీకరించుకునే అవకాశం ఉంటుంది. 1948 నుంచి ఈ ఫ్యాషన్ షో జరుగుతుండగా ఎలినర్ లాంబర్ట్(Eleanor Lambert)ప్రారంభించారు.
