English | Telugu
రామ్ చరణ్ పోరాటం.. అభిమానుల గురి ఈ సారి తప్పదేమో!
Updated : Jun 16, 2025
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్' పరాజయంతో అభిమానుల ఆశలన్నీ 'పెద్ది'(Peddi)పైనే ఉన్నాయి. ఎనభయ్యవ దశకానికి సంబంధించి రూరల్ ఏరియాలో జరిగే స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన చరణ్ లుక్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో 'పెద్ది' పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడుతు చరణ్ చెప్పిన డైలాగ్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్నపెద్ది, ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)లో షూటింగ్ ని జరుపుకుంటుంది. ప్రత్యేకంగా వేసిన ఒక భారీ సెట్ లో, కీలక పోరాట సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్ తో పాటు ముఖ్య నటులు పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో మూవీ కీలక దశకి చేరుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే 'ఎన్టీఆర్'(Ntr)తో 'దేవర'(Devara)లో జతకట్టి తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్(Ntr),జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి పేరు రావడంతో, చరణ్ అండ్ జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, 'ఉప్పెన' మూవీ ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchibabu)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్(Ar Rehman)సంగీత సారధ్యంలో చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 2026 న 'పెద్ది' వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
